
ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ విడుదల సమయాన్ని ప్రకటించింది. ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ అయినటువంటి "ఏందే ఏందే" అనే సాంగ్ ను ఈ రోజు రాత్రి 7 గంటల 02 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
అలాగే ఏజెంట్ మూవీ యూనిట్ ఈ పాటకు చంద్రబోస్ లిరిసిస్ట్ గా వివరించినట్లు ... ఈ పాటకు హిప్ హాప్ తమిజా మ్యూజిక్ ను అందించినట్టు ... సంజిత్ హెగ్డే ... పద్మలత ఈ సాంగ్ ను పాడినట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా తెలియజేసింది. మరి ఏజెంట్ మూవీ నుండి విడుదలకు రెడీగా ఉన్న "ఏందే ఏందే" సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను కూడా మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేసి ఈ మూవీ పై ఉన్న అంచనాలను మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అఖిల్ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ ల స్పీడ్ ను మరింతగా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.