తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటు లలో శివ కార్తికేయన్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో విజయా లను తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. శివ కార్తికేయన్ తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో సినిమా లను తెలుగు లో కూడా విడుదల చేసి అందు లో కొన్ని మూవీ లతో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయా లను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.


శివ కార్తికేయన్ ఆఖరుగా అనుదీప్ కేవీ దర్శకత్వం లో రూపొందిన ప్రిన్స్ అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ తెలుగు  ... తమిళ భాష ల్లో విడుదల అయ్యి యావరేజ్ విజయా న్ని అందుకుంది. ప్రస్తుతం ఈ నటుడు మా వీరన్ అనే తమిళ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఆగస్టు 11 వ తేదీన ఈ మూవీ ని తమిళ ... తెలుగు భాషలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే శివ కార్తికేయన్ తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. శివ కార్తికేయన్ తదుపరి మూవీ లో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతున్నట్లు ... ఈ మూవీ కి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: