టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకరు. దేవి శ్రీ ప్రసాద్ కు ధీటుగా థమన్ తన మ్యూజిక్ తో అదరగొట్టేస్తున్నాడు. ముఖ్యంగా థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. థమన్ చేస్తున్న సినిమాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే అదరగొట్టబోతున్నారు. ఇక తనకు ఇష్టమైన హీరో అయితే థమన్ ఓ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడు. లేటెస్ట్ గా థమన్ మరో క్రేజీ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు. అదే బ్రో.

పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. వినోదయ సీతం రీమేక్ గా వస్తున్న ఈ సినిమా కు తెలుగు టైటిల్ బ్రో గా నిర్ణయించగా సినిమా మోషన్ పోస్టర్ లో థమన్ మ్యూజిక్ తో వీరంగం ఆడేశాడు. పవన్ సినిమా అంటే థమన్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని చెప్పొచ్చు. ఇప్పటికే భీంలా నాయక్ సినిమా కు థమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయగా లేటేస్ట్ గా బ్రోకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఇరగదీశాడు.

బ్రో బిజిఎం విన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ థమన్ బ్రో ఇరగదీశావ్ పో అనేశాడు. ఈ సినిమా మ్యూజిక్ తో థమన్ మరోసారి తన సత్తా చాటబోతున్నారని తెలుస్తుంది. థమన్ తన మ్యూజిక్ తో నే బ్రో సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చేలా చేశాడు. బ్రో సినిమాకు త్రివిక్రం కూడా తన సపోర్ట్ అందిస్తున్నాడు. పవన్ త్రివిక్రం ఈ ఇద్దరు కలిస్తే రచ్చ చేయడం కన్ఫర్మ్. మొత్తానికి థమన్ కూడా బ్రో సినిమాకు తన బెస్ట్ ఇచ్చేస్తున్నాడని చెప్పొచ్చు. పవన్ సాయి తేజ్ బ్రో సినిమా జూలై 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫ్యాన్స్ కి ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: