ప్రపంచంలో చాలామంది తాము ఎంచుకున్న వృత్తులలో బాగా మేధావులుగా గుర్తింపు తెచ్చుకుంటారు కానీ సంపద విషయంలో మాత్రం చాలామందికి ఓనమాలు కూడ తెలియవు. అంతేకాదు చాలామందికి తమ సమర్ధతను ఆదాయంగా మార్చుకునే నైపుణ్యం లేకపోవడంతో చాలామంది తమ జీవితాంతం మధ్య తరగతి వ్యక్తులుగానే మిగిలిపోతారు.


ఒకవ్యక్తి ధనవంతుడుగా అదేవిధంగా పేదవాడుగా మారడానికి అతడి ఆలోచనాసరళి తల్లి తండ్రుల పరిస్థితి కుటుంబ నేపధ్యం ఈ కారణాల ప్రభావంతో ఒక వ్యక్తిలో సంపన్న భావనా అదేవిధంగా పేదరిక భావన ఏర్పడుతూ ఉంటుంది. అందుకే మన ఆలోచనలే సంపదకు బీజాలు అని అంటారు. వాస్తవానికి ఏవ్యక్తి జీవన స్థితి కూడ నిలకడగా ఉండదు. అందువల్లనే ఒక వ్యక్తి సంపాదన కోల్పోయినప్పుడు చాల ఖంగారు పడటమే కాకుండా తన చైతన్యాన్ని కోల్పోతాడు.


అందువల్లనే అలాంటి వ్యక్తులను దగ్గరకు తీసుకుని వారికి జీవితం పట్ల ఆసక్తి కలిగేలా ప్రవర్తిస్తే అలాంటి వ్యక్తులు కూడ ధనవంతులుగా మారి తీరుతారని అనేకమంది మనీ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయ పడుతున్నారు. మనం చేసే ఏ పని అయినా మన జీవనోపాది గురించి కాకుండా మన ఆనందం గురించి చేస్తున్నాము అని భావించినప్పుడు మాత్రమే ‘పేదరిక భావన సంపన్న భావనగా’ మారుతుంది. అయితే ఒక వ్యక్తి యొక్క ఆనందం అతడి ఆర్ధిక బద్రత పై ఆధారపడి ఉంటుంది.


అందుకే ప్రతి వ్యక్తి తమ ఆదాయాన్ని ఒక పైప్ లైన్ లా నిరంతరం వచ్చే విధంగా రకరకాల మార్గాలలో సంపాదన ఉండే విధంగా తన జీవితాన్ని మలుచుకోగలగాలి. అయితే ఈ విషయాలు చెప్పినంత సులువు కాదు. చేసే వృత్తిలో నిజాయితే ప్రేమ ఆత్మీయతా ఆధ్యాత్మికత ఈ లక్షణాలు అన్నీ కలుపుకుని జీవించగల వ్యక్తి నిరంతరం ఆనంద మయంగా గడుపుతాడు. ఎప్పుడైతే ఆనందం కలుగుతుందో సంపదకు సంబంధించిన ఆలోచనలు ప్రయత్నాలు వాటంతట అవే మన జీవితంలోకి వస్తాయి. అందుకే సంపదకు మూలం ఆనందంగా జీవించడం అని అంటారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: