ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు పూజ మందిరాలకు కచ్చితంగా అగర్బత్తిలను ఉపయోగిస్తూ ఉంటారు.. భారతీయ ఆచారాలలో ధూపం వేయడం చాలా ముఖ్యమని కూడా చెప్పవచ్చు. అలాగే అగర్బత్తి లకు సంబంధించి మంచి డిమాండ్ కూడా ఉన్నది. సువాసనతో కూడిన అగర్బత్తీలు, కర్పూరాలను ధూపాలను సైతం ఎక్కువగా పూజించడానికి భారతీయులు ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే మార్కెట్లో ఈ అగర్బత్తులకు మంచి డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలోనే యువత సైతం ఎక్కువగా ఈ అగర్బత్తుల వ్యాపారంలో అడుగుపెడితే మంచి లాభాలు ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు.


అగర్బత్తులు వెదురు కర్రలతో తయారుచేస్తారు.. కర్రలకు సహజంగా ఉండేటువంటి సువాసన గల పువ్వులు లేదా గంధం వంటి వాటితో  సుగంధ పూత తో వాటిని తయారు చేస్తారు.. దాదాపుగా 90 కి పైగా దేశాలలో కూడా ఈ అగర్భక్తులను సైతం ఉపయోగిస్తూ ఉంటారు.. ఎవరైనా అగర్బత్తి వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే ఇంట్లోనైనా సరే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు.. ఇండియా అంతట పండుగల సమయంలో ఈ అగర్బత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. ముందుగా ఈ అగర్బత్తుల సంస్థను ప్రారంభించడానికి కచ్చితంగా లైసెన్స్ చాలా అవసరము.. ఇందుకోసం జిఎస్టి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి.



చిన్న స్థాయిలో నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే రూ .40 నుంచి రూ .80 వేల వరకు ఖర్చు అవుతుంది. దీంతో ప్రతి నెల కూడా.. రూ.1.5 లక్షల వరకు ఆదాయాన్ని అందుకోవచ్చు. దీంతో లాభాన్ని లక్ష రూపాయల వరకు మనం అందుకోవచ్చు. ప్రస్తుతం ఉత్పత్తి కనక ప్రజలను ఆకట్టుకున్నట్లయితే మీ అగర్బత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది.. అగర్బత్తుల ప్రకటనలకు కాస్త ఖర్చు చేశారంటే మరింత వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంటుంది. అగర్బత్తిలను మనమే తయారు చేసి కొనుగోలు చేయడం వల్ల కూడా మరింత లాభాలను కూడా మనం పొందవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణానికి అనుకూలంగానే అగర్బత్తిలను తయారు చేసుకునేలా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: