దేశంలో అతిపెద్ద బీమా కంపెనీ సంస్థలలో ఎల్ఐసి కూడా ఒకటి ఎన్నో రకాల బీమా పాలసీలను సైతం రోజురోజుకీ కస్టమర్ల కోసం ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఇతరత్రా ప్లాన్లను కూడా ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ప్రజల బీమాతో పాటు పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. అలాంటి పథకాలలో lic జీవన్ లాబ్ పాలసీ కూడా ఒకటి. ఈ పొదుపులో బీమా రక్షణను కూడా పొందవచ్చు. వీటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


ఎల్ఐసి జీవన్ లాబ్ అనేది పరిమిత ప్రీమియం పే వంటిది.. నాన్ లింక్డ్.. విత్ ప్రాఫిట్ ఎండోమెంట్ ప్లాన్.. వీటిలో పొదుపుతో పాటు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఈ ప్లాన్ వ్యవధిలో పాలసీదారుడు అకస్మాత్తుగా మరణిస్తే.. పాలసీ మెచ్యూరిటీ వాళ్లకు జీవించి ఉంటే కనీసం కుటుంబానికి ఏక మొత్తంలో అందిస్తారు.. వీటితో పాటు రుణ సదుపాయం కూడా ఉంటుందట. ఈ ఎల్ఐసి జీవన్ లాబ్ పాలసీ వల్ల ప్రయోజనాలు ఏమిటంటే.. ఈ ప్లాన్ లో పాలసీదారుడు మరణిస్తే అతనిపైన ఆధారపడిన కుటుంబానికి వారి ఆర్థిక ప్రీమియం కంటే పది రెట్లు చెల్లిస్తుందట.


పాలసీదారుడు మరణిస్తే ఆ ప్రయోజనం చెల్లించిన ప్రీమియంలో 105 శాతం కంటే తక్కువగా ఉండదట కానీ సరైన సమయాలలో ఈ పాలసీని చెల్లించి ఉండాలి. ఈ పాలసీలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్నవారు చేరవచ్చు.. 25 ఏళ్ల వ్యక్తి 20 లక్షల రూపాయల హామీతో 25 ఏళ్ల పాటు ఈ ప్లాన్లో ఉంటే అతను వార్షికంగా రూ.88,910 రూపాయలు లేదా ప్రతిరోజు 243 రూపాయలు ప్రీమియం చెల్లించాలి.. దీని ద్వారా 50 సంవత్సరాల వయసులో అతనికి 54 లక్షల వరకు ప్రయోజనం అందుతుంది. ఇందులో రివర్షనరీ బోనస్, చివరి అదనపు బోనస్ ప్రయోజనాలు కూడా ఉంటాయి.. ఇందులో 16 సంవత్సరాలు 21 సంవత్సరాలు 25 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: