రాజ్ తరుణ్ తనకు మొదటి హిట్ ఇచ్చిన నాగార్జున నే నమ్ముకున్నాడు.. ఇంతకుముందు రాజ్‌ను ‘ఉయ్యాల జంపాల’తో హీరోగా నిలబెట్టింది నాగార్జునే. మళ్లీ ఆయనే అతణ్ని రక్షించడానికి ముందుకు వచ్చాడు.ఇంతకుముందు రాజ్‌తో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అనే సినిమా తీసి ఫెయిలైన శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. విశేషం ఏంటంటే.. ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్న రాజ్‌ను, తొలి సినిమాతో మెప్పించలేకపోయిన శ్రీనివాస్‌ను నమ్మి అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రావడం కొంత రిస్క్ అని చెప్పాలి..