అయితే గత వైసీపీ ప్రభుత్వంలో గ్యారెంటీలు పెట్టి అప్పులు తీస్తే జగన్ రాష్ట్రంలో ఉన్న ఆ ఆస్తులన్నీ తాకట్టుపెట్టి మరి అప్పులు చేస్తున్నారు.. భవిష్యత్తులో తాగుబోయే వాటికి కూడా అప్పులు తీసుకుంటున్నారని అంటూ గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు చేస్తున్న అప్పులను సైతం వైసిపి తెలియజేస్తూ.. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ రాబోయే ఐదేళ్ల మద్యం మీద వచ్చే డబ్బులని బేస్ చేసుకుని అప్పులు తెచ్చారంటూ తెలియజేస్తున్నారు.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు APSDC ద్వారా రూ .25 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. 1941 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని అందులో తాకట్టు పెట్టారు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసరికి రూ .9,000 కోట్ల బాండ్ల కోసం, ఒక లక్ష 91 వేల కోట్ల ఖనిజ సంపాదన తాకట్టు పెట్టారనేటువంటి అంశాన్ని వైసిపి తెలియజేస్తోంది. రాబోయే భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టు పెట్టారని.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి, రాష్ట్ర సమీకృత నుంచి డబ్బు తీసుకునే హక్కు కూడా ఇచ్చేశారు.. ఇదంతా కూడా భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఎక్కడా జరగలేదని తెలియజేస్తున్నారు. APSPCL దగ్గర చూస్తే.. రూ. 5490 కోట్ల బాండ్ భవిష్యత్తు ఆదాయ భద్రతను గ్యారెంటీగా పెట్టి తీసుకున్నారని, అప్పుడు జగన్ చేస్తే తప్పన్నారు ఇప్పుడు మీరు చేస్తోంది కరెక్టేనా అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు?.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి