తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు వచ్చేసింది. వచ్చేవారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పుడు హౌస్ లో 6గురు కంటెస్టెంట్స్ ఉండగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటూ హోస్ట్ నాగార్జున అనౌన్స్మెంట్ చేశారు. దీంతో శనివారం సుమన్ శెట్టి ఎలిమెంట్ అయ్యారు. హౌస్ లో ఎలాంటి నెగెటివిటీ లేకుండా ఎవరితో ఒక్క మాట పడకుండా సుమారుగా 14 వారాల పాటు హౌస్ లో ఉండి పేరు సంపాదించిన సుమన్ శెట్టి ఎలిమినేషన్ తర్వాత భరణి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.


హౌస్ నుంచి బయటికి రాగానే మనిద్దరం కలిసి పనిచేస్తాం ,షూటింగ్ కి వెళ్తున్నామంటూ భరణి తెలియజేశారు. అలాగే సుమన్ శెట్టి ప్రభంజనం అంటూ ఇమ్మాన్యుయేల్  హైలెట్ చేశారు.. సుమన్ శెట్టి కూడా చివరకు అధ్యక్ష వెళ్ళొస్తా అంటూ తన పవర్ ఫుల్ డైలాగ్ తో చెప్పి బయటికి చేశారు. వెళ్లేటప్పుడు మా అన్న భరణిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ హౌస్ మేట్స్ ని రిక్వెస్ట్ చేశారు సుమన్ శెట్టి. అనంతరం స్టేజ్ మీద నాగార్జున ఇలా అడుగుతూ ఫైనల్ వీక్ ముందే ఎలిమినేట్ అయ్యావు కదా! ఎలా ఉందని అడగగా  సుమన్ శెట్టి మాట్లాడుతూ.. హ్యాపీగానే ఉంది సార్..ఒక వారం ఉంటే టాప్ 5 లో వెళ్లేవాడ్ని చెప్పడంతో.. సుమన్ శెట్టి జర్నీని చూపిస్తూ ఎమోషనల్ అయ్యారు నాగార్జున.



ఇదంతా ఇలా ఉంటే సుమన్ శెట్టి అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న సెలబ్రిటీ లిస్టులో చేరిపోయారనే విధంగా వినిపిస్తున్నాయి. ఆయనకు రోజుకు రూ.45 వేల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా వినిపిస్తోంది. అంటే 14 వారాలకు గాను రూ .44 లక్షల రూపాయల వరకు అందుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న రెండవ సెలబ్రిటీగా సుమన్ శెట్టి నిలుస్తారని తెలుస్తోంది. అలాగే ఈరోజు (ఆదివారం) ఎపిసోడ్లో భరణి ఎలిమినేట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: