టాలీవుడ్ మోస్ట్ అవైడెడ్ మూవీ అఖండ 2 తాండవం. నందమూరి బాలకృష్ణ ,బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన నాలుగోవ చిత్రమే అఖండ2. ఎట్టకేలకు డిసెంబర్ 12వ తేదీన థియేటర్లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇందులో బాలకృష్ణ నట విశ్వరూపం అందరినీ ఆకట్టుకునేలా చేసాయి.మాస్ యాక్షన్ ఆధ్యాత్మిక అంశాలతో కలిపి తీసిన సినిమా కథ కావడంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎప్పటిలాగే థమన్ అందించిన బిజిఎం హైలెట్గా నిలిచింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజే రూ. 59.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఇది బాలయ్య కెరియర్ లోనే మొదటిరోజు ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.


ఇక రెండవ రోజు కూడా అదే విధమైనటువంటి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా తాజాగా అఖండ 2 సినిమా ప్రదర్శిస్తున్న ఒక థియేటర్లో స్క్రీన్ లో మంటలు వస్తూ ఉన్న వీడియోని అభిమానులు వైరల్ గా చేస్తున్నారు. తణుకు v MAX థియేటర్లో  సెకండ్ షో ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. థమన్ అందించిన బిజిఎం వల్ల థియేటర్లు షేక్ అవుతున్నట్లు అభిమానులు ఈ వీడియోని వైరల్ గా చేస్తున్నారు. అలాగే ఆదోని ప్రాంతంలో మరో థియేటర్లో స్పీకర్లు పగిలిపోవడంతో కాసేపు సినిమా షోను ఆపివేసినట్లుగా తెలుస్తోంది. ఇలా అఖండ మూవీ ప్రదర్శన సమయంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇప్పుడు మళ్లీ అఖండ 2 చిత్రానికి కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.


అఖండ 2 చిత్రంలో సనాతన ధర్మం గొప్పదనాన్ని వివరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈ సినిమా చూడడానికి అఘోర వేషధారణలో కూడా చాలామంది థియేటర్స్ కి వచ్చి చూస్తున్నారు. ఈ సినిమాలోని సన్నివేశాలు చూసి సీట్ల నుంచి లేచి మరి అభినందిస్తున్నట్లు కొన్ని వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. బాలకృష్ణ తో పాటుగా సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి జగపతిబాబు తదితర నటీనటులు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: