తారకరత్న చనిపోయి ఇన్ని రోజులైనా కూడా ఆయన్ని ఎప్పుడు ఎవరో ఒకరు తలుచుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి అయితే ప్రతి సారి భర్తతో ఉన్న మెమోరీస్ ని తన భర్తని మిస్ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అయితే అలాంటి తారకరత్న ఓ డైరెక్టర్ దగ్గర అడ్వాన్సుగా మూడు లక్షలు తీసుకొని చివరికి అలా చేశారట.మరి ఇంతకీ మూడు లక్షలు అడ్వాన్స్ తీసుకొని తారకరత్న చేసిన ఆ పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నందమూరి నటుడు తారకరత్న సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడే ఏకంగా తొమ్మిది సినిమాలను స్టార్ట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.అలా భారీ ఎత్తున ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి అంత సక్సెస్ కాలేకపోయారు. 

అయితే అలాంటి తారకరత్న సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా కూడా ఫలితం లేకపోవడంతో రాజకీయాల్లోకి రావాలనుకున్నారు.అలా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.ఆ తర్వాత బెంగళూరులోని హాస్పిటల్ లో చేర్పించిన కూడా ఫలితం లేకపోయింది. చివరికి దాదాపు 20 రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ తుది శ్వాస విడిచారు. అయితే అలాంటి తారకరత్న గురించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వి. సముద్ర షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.

ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారకరత్న మనస్తత్వం చాలా మంచిది. ఆయనతో నేను ఓ సినిమా చేయడం కోసం అడ్వాన్స్ గా మూడు లక్షలు ఇచ్చాను.కానీ అంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.అలాగే ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు అనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇక లవ్ మ్యారేజ్ చేసుకున్నాక తల్లిదండ్రులు మాట్లాడలేదు.దాంతో తారకరత్న నాతో వాళ్ళ నాన్నకు ఫోన్ చేయించి సినిమాల గురించి మాట్లాడమని చెప్పి ఆయనతో మాట్లాడుతూ ఉంటే స్పీకర్ పెట్టి తండ్రి మాటలు విని మురిసిపోయేవాడు అంటూ తారకరత్న గురించి తెప్పి ఎమోషనల్ అయ్యారు డైరెక్టర్ వి. సముద్ర

మరింత సమాచారం తెలుసుకోండి: