ఇవి చాతి ,కడుపు ,వెన్నుపాము, చేతులు లాంటి శరీర భాగాలలో కనిపిస్తాయి. ఇవి ఎలాంటి అంటూ వ్యాధులు కాదు క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఉండదని తెలియజేస్తున్నారు. ఈ మచ్చలు వయసు పెరుగుదల కారణంగా వస్తూ ఉంటాయి. వయస్సుతో రక్తనాళాలలో నిర్మాణం మార్పులు రావడం వల్లే ఇవి వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా ఉన్న ఇవి వస్తాయి. అలాగే మహిళలు గర్భంతో లేదా హార్మోన్ మార్పుల సమయాలలో కూడా వస్తుంటాయని తెలుపుతున్నారు..
చెర్రీ అంజిమోయాస్ అనేవి హానికరం కాకపోయినాప్పటికీ కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వీటిని మనం ఎలాంటి సమయంలోనైనా రుద్దితే రక్తస్రావం జరిగి మచ్చగా మారుతుంది. అయితే ఇవి శరీరం పైన ఎక్కువగా కనిపిస్తే మాత్రం వైద్యుని సంప్రదించడం మంచిది.. వీటికి సంబంధించి చికిత్స విషయానికి వస్తే వీటికి ఎలాంటి చికిత్స అనేది లేదట. కానీ రూపం కారణంగా ఇబ్బంది పడేవారు మాత్రం లేజర్ చికిత్స ద్వారా వీటిని తొలగించుకోవచ్చు. ఇవే కాకుండా మరికొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నొప్పి లేకుండా మచ్చలు లేకుండా పూర్తిగా నయం చేస్తాయి. చెర్రీ అంజిమోయాస్ కేవలం వయసుతో వచ్చే సహజ మార్పులే కానీ ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవని తెలుపుతున్నారు. ఒకవేళ సడన్గా ఏమైనా మార్పులు కనిపిస్తే మాత్రం వైద్యుడు సంప్రదించడం మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి