ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడాపెడ అప్పులు చేస్తూ ఇప్పుడు కొత్త అప్పుల కోసం కొత్త దారులు వెతుకుతున్నారంటు వైసీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులుగా పారిస్తున్న సీఎం చంద్రబాబు, ఇప్పుడు రాబోయే మద్యాన్ని తాకట్టు పెట్టి మరి అప్పు చేస్తున్నట్లుగా వైసీపీ తెలియజేస్తోంది. ఎక్సేంజ్ బాండ్ల ద్వారా ఏకంగా రూ. 5,490 కోట్ల రూపాయల సేకరించారు. బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ ద్వారానే ఈ బాండ్లు సేకరించినట్లుగా తెలియజేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు 9.15% వరకు భారీ వడ్డీకి అప్పు తెచ్చినట్లుగా తెలియజేస్తున్నారు.


చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతోంది.. దీంతో ఇప్పటివరకు చేసిన అప్పులు రూ. 2,66,175 అన్నట్లుగా తెలుపుతున్నారు. అలాగే ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం మరో 7,387,70 కోట్ల రూపాయలకు అప్పు చేసినట్లుగా డిసెంబర్ 12న వెల్లడించారు. గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులలో 80 శాతాన్ని చంద్రబాబు ఇప్పుడే దాటేశారంటూ తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం తక్కువ వడ్డీకి అప్పులు చేసి అభివృద్ధి చేస్తే రాష్ట్రం దివాలా తీస్తోంది శ్రీలంక అయిపోతుంది అంటూ దుష్ప్రచారం చేశారని ఇప్పుడు లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఉంటే రాష్ట్రం శ్రీలంక కాదు .. సౌత్ సోడానే అవ్వదా అంటూ నిపుణుల సైతం ప్రశ్నిస్తున్నారు?



రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎంత పెరిగితే అంత అప్పు ఇస్తారని , ఏడాదికి 35 వేల కోట్లు టార్గెట్, అందుకే విచ్చలవిడిగా మద్యం అమ్మకం ఏపీలో జరిగేలా చూస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.. చంద్రబాబు ఇప్పుడే కాదు గతంలో కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుల ప్రభుత్వంగానే నడిపారని.. గత ఐదేళ్లలో అప్పుల సిఏజిఆర్ 13.57 % ఉండగా కానీ చంద్రబాబు హయాంలో మాత్రం సిఏజిఆర్ మాత్రం 22.63% ఉందని చెబుతున్నారు.. అలాగే 2014 - 19 లో కూడా అధిక వడ్డీలతోనే అప్పులను చంద్రబాబు చేశారంటు చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పుడు చూస్తే ఏకంగా 18 నెలల్లోనే 80 శాతం వరకు అప్పులను చేసేసారని నిపుణులు తెలియజేస్తున్నారని వైసీపీ అనుకూల మీడియా రాసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: