పశ్చిమ బెంగాల్లోని మిడ్నపూర్ లో కేంద్రమంత్రి మురళీధరన్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాన్వాయ్ పై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఇక ఈ ఘటన చూసిన కస్తూరి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు..కేంద్ర మంత్రి పరిస్థితే ఇలా ఉంటే,ఇక మామూలు జనం పరిస్థితి ఏమిటని? ఆమె ప్రశ్నించారు చుట్టూ ఎంతో మంది సెక్యూరిటీ తో వచ్చే కేంద్ర మంత్రి కాన్వాయ్ కి ఇలా జరిగింది. ఇక కింది స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటో? ఊహించుకోలేకపోతున్నాను. వారు మనుషులేనా? అది గూండా రాజ్యం లా కనిపిస్తోంది అంటూ కస్తూరి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు...