రాజా.. విక్టరీ వెంకటేష్ హీరోగా , అందాల భామ సౌందర్య కలిసి జంటగా నటించిన చిత్రం రాజా. ఈ చిత్రం పేరు వినగానే చాలు ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు . ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు అందరినీ అలరించాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాను 1999లో ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించారు. ఈ చిత్రం ముందుగా 1998లో తమిళంలో కార్తీక్, రోజా జంటగా నటించిన "ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్" అనే సినిమాను రీమేక్ చేసి తెలుగులో రూపొందించారు. ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు స్వరాలు అందించగా, ఈ సినిమా పాటలు బాగా ప్రజాదరణ పొందాయి..