టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువన్ నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే మూవీ తో  హీరో గా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన జాతి రత్నాలు ,  మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీలు కూడా మంచి విజయలను సాధించడంతో ఈయన తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. అవి ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి.

ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన మూడు సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకోవడం , అనగనగా ఒక రాజు మూవీ కి సంబంధించిన ప్రచార చిత్రాలు పేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 12 వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్న జనవరి 13 వ తేదినే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ప్రదర్శించనున్నారు. దానితో ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గనుక సూపర్ గా సక్సెస్ అయినట్లయితే ఈ మూవీ ప్రీమియర్ షో లకు , ఆ తర్వాత ఈ రిలీజ్ డే ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: