ఇండియన్ సినీ చరిత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటివరకు భారత దేశ సినీ చరిత్రలో రానటువంటి పాన్ ఇండియా సినిమాలో నటించడమే కాకుండా మొట్టమొదటి పాన్ ఇండియా హీరో కూడా ప్రభాసే.. ఎందుకంటే ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయింది.మొదటి పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ అయ్యారు.అలా ఏ విషయంలోనైనా ఇప్పటి జనరేషన్ హీరోలలో ముందుండే ప్రభాస్ ఆ రేర్ ఫీట్ సాధించడంలో కూడా అందరికంటే ముందే ఉన్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో అలాంటి రికార్డు సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్ తాజాగా విడుదలైన ది రాజా సాబ్ మూవీతో పేరు తెచ్చుకున్నారు. మరి ఇంతకీ ప్రభాస్ సాధించిన ఆ రికార్డు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

రెబల్ స్టార్ ప్రభాస్ నటించి తాజాగా విడుదలైన మూవీ ది రాజాసాబ్.. జనవరి 9న విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మొదటి రోజు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. అలా చిత్ర యూనిట్ అఫీషియల్ పోస్టర్ ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ది రాజా సాబ్ మూవీ ఏకంగా 112 కోట్లు సాధించి 100 కోట్లు కొల్లగొట్టిన సినిమా లిస్టులో చేరిపోయింది.అయితే ఇప్పటివరకు ప్రభాస్ నటించిన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా వరుసగా ఆరు సినిమాలు 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి వరుసగా  6 సినిమాలకు 100 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న ఏకైక హీరోగా ఇండియన్ సినీ హిస్టరీలో ప్రభాస్ పేరు నిలిచిపోయింది. ఎందుకంటే ప్రభాస్ నటించిన బాహుబలి 2, ఆ తర్వాత వచ్చిన సాహో రెండు సినిమాలు కూడా మొదటిరోజు 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించాయి.

అలాగే భారీ డిజాస్టర్ అయినటువంటి ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ మూవీ కూడా డిజాస్టర్ టాక్ తో మొదటి రోజే దాదాపు 140 కోట్లు వసూళ్లు చేసింది.అలాగే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీ కూడా మొదటి రోజు ఏకంగా 178 కోట్లు కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన కల్కి 2898 AD మూవీ కూడా మొదటి రోజు ఏకంగా 191 కోట్ల కలెక్షన్స్ సాధించి అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.కల్కి సినిమా తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన ది రాజా సాబ్ మూవీ కూడా మొదటి రోజు 112 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అలా వరుసగా ఆరు సినిమాలు 100 కోట్ల ఓపెనింగ్స్ తో అద్భుతమైన రికార్డుని క్రియేట్ చేశారు ప్రభాస్. ఇప్పటివరకు ఇలాంటి రికార్డు క్రియేట్ చేసిన మొట్టమొదటి హీరోగా ప్రభాస్ సినీ చరిత్రలో నిలిచిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: