చిరంజీవి, నయనతార , డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. దీంతో బుక్ మై షోలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా పేజీని ఓపెన్ చేస్తే (కోర్టు ఆదేశానుసారం రేటింగ్ ,రివ్యూలను నిలిపివేయబడ్డాయి) అనే మెసేజ్ కూడా కనిపిస్తుంది. చాలామంది సినిమా చూడకముందే ఫేక్ రివ్యూలు ఇవ్వడం వల్ల అలాగే రేటింగ్స్ కూడా చాలా తగ్గించి ఇవ్వడం వల్ల సినిమా పైన ఎఫెక్ట్ చూపుతోందని ఇకమీదట ఇలాంటివి జరగకుండా ఉండేందుకే చర్యలు చేపట్టడానికి కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంది మెగా టీమ్.
ఇలాంటి అసాధారణమైన నిర్ణయాన్ని అమలు చేయడానికి నిర్మాతలు సైతం aiplex, block bigg వంటి ఆంటీ పైరసీ సంస్థలతో కలిసి చేతులు కలిపారు. సోషల్ మీడియా, టికెట్స్ బుకింగ్ ప్లాట్ ఫామ్ల అభిప్రాయాలు సినీ ప్రేక్షకుల మీద చాలా ప్రభావితం చూపిస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. కేవలం థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రమే తమ సొంత నిర్ణయాన్ని తీసుకునే విధంగా కల్పించింది చిత్ర బృందం. మరి మెగాస్టార్ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే పెద్ద సినిమాలకు కూడా మార్గదర్శకం అవుతుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. అయితే సంక్రాంతి బరిలో ఉండే ఇతర సినిమాల మేకర్స్ కూడా ఇదే తరహాలోని ఆర్డర్స్ తీసుకున్నట్లు వినిపిస్తోంది. దీంతో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు బుక్ మై షోలో రివ్యూస్ కానీ, రేటింగ్స్ ఇచ్చే అవకాశం ఉండదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి