ఆఘ మేఘాల మీద తాను పరుగులు పెడుతూ తన యూనిట్ సభ్యులను నటీనటులను పరుగులు తీయిస్తూ పవన్ జారీ చేస్తున్న ఆజ్ఞలకు తట్టుకోలేక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ యూనిట్ టెన్షన్ పడిపోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. డైరక్టర్ బాబీతో ఎటువంటి సంబంధం లేకుండా ఫైట్ మాస్టర్లు పవన్ కలిసి ఒకేసారి మూడు యూనిట్లు నడుపుతూ ఏమితీస్తున్నారో తెలియని స్పీడ్ లో నిర్మాణం జరుపుకుంటున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ యూనిట్ ఈసినిమా ఆడియో వేడుక అయిన వెంటనే ఈనెల 21న పాటల చిత్రీకరణకు విదేశాలకు వెళ్తోంది.
కేవలం ఆరు రోజుల్లో మూడు పాటలు చిత్రీకరించాలని పవన్ తన యూనిట్ సభ్యులకు హుకుమ్ జారీ చేసినట్లు టాక్. పవన్ మాటలకు షాక్ అయిన కొందరు ఇది సాధ్యమేనా ? అని ధైర్యం చేసి ప్రశ్నిస్తే గతంలో సూపర్ స్టార్ కృష్ణ తాను నటించిన కొన్ని సినిమాలలో ఒకేరోజులో పాటపూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయని అందువల్ల రెండురోజుల్లో ఒకపాట తీయడం కష్టం కాదని తన యూనిట్ సభ్యులకు పవన్ వివరించినట్లు టాక్. అంతేకాదు ఏదిఎలా ఉన్నా ఆరురోజుల్లో మూడుపాటలు పూర్తిచేసి తీరాలి అని పవన్ మొండి పట్టుదల పై ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మార్చి 21కి ‘సర్దార్’ విడుదల తేదీ ఏప్రిల్ 8కి మధ్య కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో అన్ని పనులు పూర్తి చేసుకుని సెన్సార్ కు ఫస్ట్ కాపీ రెడీ పెట్టడం అయ్యే పనియేనా ? అని దర్శకుడు బాబీకి మనసులో ఉన్నా బయట పెట్టలేని పరిస్థితిలో నలిగిపోతున్నాడు అని టాక్. ఇది ఇలా ఉండగా ఈనెల 20వ తారీఖున జరగబోతున్న ఈసినిమా ఆడియో ఫంక్షన్ ఛానల్ రైట్స్ ను ఇప్పటికే రెండు ఛానళ్లకు చెరో యాభై లక్షలకు ఈసినిమా నిర్మాత శరత్ మరార్ అమ్మేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈరోజు విడుదల కాబోతున్న ఈసినిమా టీజర్ 40 సెకన్స్ నిడివితో ఉంటుందని సమాచారం. ఈసినిమా డబ్బింగ్ రూమ్ నుండి వినిపిస్తున్న రూమర్ల ప్రకారం ఈట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. కేవలం ఒకే ఒక్క షాట్ లో కాజల్ అగర్వాల్ ను చూపించారట. టైటిల్ సాంగ్ తో కూడిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పవర్ స్టార్ ను అధ్బుతమైన యాంగిల్స్ లో చూపెడుతూ 40 సెకన్ల టీజర్ ను కట్ చేసినట్లుగా చెప్తున్నారు. ఏమైనా ఎన్నో గందరగోళాల మధ్య రెడీ అవుతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ హైక్ తో టాలీవుడ్ షేక్ అవుతోంది..