మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది మైమరిపించే స్టెప్స్. అయితే చిరంజీవి  డ్యాన్స్ ను చూసి 9 సంవత్సరాలు దాటిపోతోంది. సినిమాలను వదిలి రాజకీయాల బాట పట్టిన చిరంజీవి స్టెప్ లకోసం ఆయన 150వ సినిమా గురించి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే అది ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. 

గత సంవత్సరం రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాలో కొద్ది నిముషాల పాటు ఒక మెరుపు మెరిసి ఒక ఫైట్ కూడ చేసాడు చిరంజీవి. అయితే చిరంజీవి డాన్స్ లను చూడాలి అన్న కోరిక అయిన 150వ సినిమా విడుదల కాకుండానే మెగా అభిమానులకు తీరే అవకాశం ఏర్పడింది. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం చిరంజీవి ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఒక వేదిక పై డాన్స్ చేయబోతున్నాడు అని తెలుస్తోంది. 

ఈనెల 12న మాటివి అవార్డ్స్ ఫంక్షన్ జరగబోతున్న నేపద్యంలో చిరంజీవిని ఒక పాటకు లైవ్ పెర్ ఫార్మెన్స్ చేయవలసిందిగా చిరంజీవిని మాటివి యాజమాన్యం చాల గట్టిగా ఒత్తిడి చేసి కోరుతునట్లు టాక్. మాటివితో చిరంజీవికి ఉన్న అనుబంధం రీత్యా ఈ కోరికకు చిరంజీవి ఇంచుమించు ఓకె చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

‘కత్తిలాంటోడు’ సినిమాలో చిరంజీవి స్టెప్స్ వేసి మెప్పించగలడా ? అని కొందరు చేస్తున్న విమర్శలకు సమాధానంగా చిరంజీవి తన లైవ్ డాన్స్ పెర్ ఫార్మెన్స్ ను ఒక ఆయుధంలా మార్చుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వార్తలే నిజం అయితే మాటివి అవార్డ్స్ నైట్ కే కాదు మీడియా కెమెరాలకు కూడ చిరంజీవి లైవ్ డాన్స్ పెర్ ఫార్మెన్స్ హాట్ న్యూస్ గా మారుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: