భారీ అందాల నమిత పేరు చెబితేనే కుర్రకారు ఊహాలోకం లోకి వెళ్లిపోతారు. మొదట్లో తెలుగు సినిమాల్లో నటించిన నమిత ఇప్పుడు తమిళ నాట బిజీగా ఉంది. ఆమె భారీ అందాలకు తమిళ తంబీలు ఎప్పుడో ప్లాట్ అయ్యారు. కాగా, నమిత తాజాగా ‘రాజకీయ’ అనే ఓ కన్నడ సినిమాలో నటిస్తుంది. ప్రస్తత రాజకీయాల నేపధ్యంలో.. రాజకీయ పార్టీల, నేతలపై వ్యంగ్యాస్త్రాలతో ఈ సినిమా రూపొందుతుంది. ఈ ‘రాజకీయ‘లో నమిత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషిస్తుందని చిత్ర యూనిట్ అంటుంది.
దీంతో నమిత సినిమాలంటే స్కిన్ షోగా భావించే ఆమె వీరాభిమానులు ‘ఇలాగైతే ఏలా నమిత..?’ అని తమలో తాము తెగ ఫీలయిపోతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: