పూరిజగన్నాథ్‌ జూనియర్ ల మధ్య సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. పూరి డైరెక్షన్‌ లో వచ్చిన ‘టెంపర్’ తరువాత జూనియర్ కెరియర్ గ్రాఫ్ లో చాల మార్పులు వచ్చాయి.  ఆతరువాత పూరి జూనియర్ ల కాంబినేషన్ లో మరొక సినిమా వస్తుంది అని వార్తలు వచ్చినా ఆ ప్రాజెక్ట్ రకరకాల కారణాలతో అటకెక్కిన విషయం తెలిసిందే.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో ప్రస్తుతం టాప్ హీరోల అభిమానానికి దూరంగా ఉంటున్న పూరి జగన్నాథ్ బాలకృష్ణతో చేస్తున్న తన 101వ చిత్రం దసరాకి రిలీజ్‌ అవుతుందని ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఇప్పటికే ఈదసరా సీజన్ పై కన్నేసిన జూనియర్ కు పూరి తీసుకున్న నిర్ణయం తలనొప్పిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం జూనియర్ బాబి దర్శకత్వంలో నటిస్తున్న 'జై లవకుశ' చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. అయితే ఈచిత్రం సెట్స్‌ మీదకి వెళ్లడానికి కాస్త సమయం పట్టడంతో  మరో మూడు నెలల్లో షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ మొత్తం పూర్తయ్యే పరిస్థుతులు కనిపించడం లేదు. 

దీనితో ఈచిత్రాన్ని ముందు అనుకున్న ఆగష్టుకు విడుదల చేయడం కష్టం అవుతున్న నేపధ్యంలో ఈమూవీ కూడా దసరాకే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని అంటున్నారు. ఇప్పుడు ఈపరిస్తుతులే జూనియర్ కు టెన్షన్ పెడుతున్నట్లు టాక్. గత సంవత్సరం వచ్చినట్లుగా బాబాయ్‌ అబ్బాయ్‌ ల మధ్య క్లాష్‌ వచ్చి ఒకరి సినిమాల పై ఒకరు పోటీపడుతూ 'డిక్టేటర్‌', 'నాన్నకు ప్రేమతో' విడుదల అయినట్లుగా పరిస్థుతులు మళ్ళీ ఏర్పడితే ఈ అనవసరపు పోటీ తనకు మాత్రమే కాకుండా తన సోదరుడు కళ్యాణ్ రామ్ కు కూడ తీవ్ర నష్టం కలిగిస్తుందని జూనియర్ భయ పడుతున్నట్లు టాక్. 

దీనితో బాలయ్యతో పూరి తీస్తున్న సినిమాని తన సినిమాతో పోటీగా కాకుండా ఒక నెలరోజుల తరువాత విడుదల చేయమని జూనియర్ పూరీతో రాయబారాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ రాయబారాలకు బాలయ్య ఎంత వరకు సహకరిస్తాడో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: