‘బాహుబలి 2’ తో ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిన నేపధ్యంలో టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి ప్రభాస్ చేరిపోయినట్లే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ‘బాహుబలి 2’ తరువాత ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సాహో’ టీజర్ ఇప్పటికే విడుదలైన నేపధ్యంలో ఈసినిమా పై కూడ భారీ అంచనాలు అభిమానులు పెట్టుకుంటున్నారు.

150 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు తమిళ హిందీ భాషలలో ఒకేసారి విడుదల చేయడానికి టార్గెట్ ఏర్పరుచుకుని ఈసినిమాకు 150 కోట్ల భారీ బడ్జెట్ ను ఖర్చు పెడుతున్నారు. దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి సంబంధించి ఇప్పుడు హీరోయిన్ ఎంపిక పై దృష్టి పెట్టారు. 

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ద్వారా దక్షినాది ఉత్తరాది సినిమా ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈసినిమాకు హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీలు ప్రణతి చోప్రా శ్రద్ధా కపూర్ లలో ఎవరో ఒకర్ని హీరోయిన్ గా ఎంపిక చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలలో ఈసినిమా దర్శక నిర్మాతలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీలు ఇద్దరితో ఈసినిమా ప్రాజెక్ట్ కు సంబంధించి రాయబారాలు జరుపుతున్నప్పుడు ఈ బాలీవుడ్ బ్యూటీలు ఇచ్చిన షాక్ కు ఈసినిమా నిర్మాతలు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ పక్కన ‘సాహో’ లో నటించడానికి వీరిద్దరు అంగీకరిస్తూ ఎవరూ ఊహించని కండిషన్స్ పెట్టినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. తాము ఈసినిమాకు సంబంధించి తెలుగు తమిళ వర్షన్స్ లో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేకపోయినా తాము ప్రభాస్ పక్కన హిందీ వర్షన్ లో మాత్రం నటించము అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పుడు ఈ హాట్ గాసిప్పులు ఫిలింనగర్ లోకి ప్రచారంలోకి రావడంలో ‘బాహుబలి 2’ ఎవరూ ఊహించని రికార్డులను సాధించినా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ మాత్రం ప్రభాస్ ను ఇంకా నేషనల్ స్టార్ గా కాకుండా దక్షిణాది హీరోగా మాత్రమే ఇంకా పరిగణిస్తున్నారా అంటూ కొందరు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: