సినిమా ఇండస్ట్రీలో ఎక్కడైనా ఒక కథానాయిక స్టార్ గా మారిపోతే ఆ తరువాత వాళ్ల సిస్టర్స్ కూడా రంగప్రవేశం చేస్తుంటారు.ఇప్పటి వరకు తెలుగులో స్టార్ హిరోయిన్లుగా వెలిగిపోయిన జయసుధ, రాధ,రాధిక,భానుప్రియ ఇలా చాలా మంది హీరోయిన్లు వారి చెల్లు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. 

వారిలో కొంత మంది కెరీర్ మలుపు తిరిగినా కొంత మంది మాత్రం సక్సెస్ సాధించలేక పోయారు. తాజాగా నీ నటి అంజలి చెల్లెలు ఆరాధ్య అని, ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టబోతుందంటూ వస్తున్న వార్తలపై స్పందించింది అంజలి. 

తనకు చెల్లెలు లేదని ఉన్నదల్లా ఒక అక్క మాత్రమే అని ఆమె పెళ్లి చేసుకొని తను కుటుంబంతో ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని  అంజలి మేనేజర్ రియాజ్ కే అహ్మద్ పెట్టిన ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ తెలిపింది అంజలి.


మరింత సమాచారం తెలుసుకోండి: