ఒక సినిమాకు ఫెయిల్యూర్ టాక్ వచ్చిన తరువాత ఆసినిమాకు ఎన్ని రిపేర్లు చేసి ఎన్ని యాడింగులు  చేసినా ఆ సినిమా గట్టు ఎక్కిన సందర్భాలు గతంలో లేవు ఇప్పటికే ఎవరి ఊహలకు కూడా అందుకోలేనంత అత్యంత భారీ స్థాయి ఫెయిల్యూర్ గా మారిన ‘అజ్ఞాత వాసి’ ని కలెక్షన్స్ పరంగా కనీసం సంక్రాంతి పండుగ వరకు అయిన నిలబెట్టాలని చేస్తున్న ఆఖరు ప్రయత్నాలకు  సంబంధించిన పబ్లిసిటీ పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్.

 

గతంలో చిరంజీవి ‘శంకర్ దాదా ఎంబీ బీఎస్’ కు ఫస్ట్ వీక్ లో డివైడ్ టాక్ వచ్చే సరికి జెమిని ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఒక పాటను కంపోజ్ చేయించి చిరంజీవి సోనాలీ బింద్రేల మీద ఆపాటను చిత్రీకరింపచేసి ఆపాటను యాడ్ చేసారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండా ‘శంకర్ దాదా ఎంబీ బీఎస్’ జస్ట్ యావరేజ్ సినిమాగా మాత్రమే నిలిచింది. అప్పుడు కూడ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ   అప్పటికే ఆసినిమాను చూసిన వాళ్లు వెర్రోళ్లా ? ఫస్ట్ వీక్ లో చూసిన వాళ్లకు అదనపు సీన్లను లేదా పాటను చూసే అర్హత లేనట్టా ? అంటూ అప్పట్లో సెటైర్లు పేలాయి.

 PAWAN IN AGNATHAVASI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు ‘అజ్ఞాత‌వాసి’ విషయంలో కూడా అదే జరగడం మరింత సెటైర్లకు తావు ఇస్తోంది. సంక్రాంతి నుంచి వెంకటేష్ నటించిన కొత్త సీన్లు అంటూ మీడియాలో విపరీతం గా ప్రచారం చేస్తున్నారు  దీనితో ఈ సినిమాకు కనీసం కలెక్షన్స్ రాబట్టడానికి కుడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ సరిపోదా అంటూ మరి కొందరు సెటైర్లు వేస్తూ వెంకటేష్  కొన్ని సీన్లలో నటించాడని చెప్పుకుని ‘అజ్ఞాతవాసి’ కి జరుతున్న పబ్లిసిటీని చూసి ఇప్పటి వరకు ఈసినిమాను చూసిన వాళ్లు వెర్రివాళ్లా ? అంటూ మరి కొందరు జోక్ చేస్తున్నారు.

 PAWAN IN AGNATHAVASI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇలాంటి  చీప్ ట్రిక్స్ ఒక చిన్న హీరో సినిమాకు చేస్తే బాగుంటుంది కాని పవర్ స్టార్ పేరుతో టాప్ హీరోగా కొనసాగుతున్న పవన్ సినిమాకు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ ఏమిటి అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. అంతేకాదు వెంకటేష్ పేరు చెప్పి ‘అజ్ఞాతవాసి’ కి కలెక్షన్స్ రాబట్టుకోవలసిన పరస్థితి ఏర్పడిందా ? అంటూ వస్తున్న కామెంట్స్ విని పవన్ అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు టాక్..

 


మరింత సమాచారం తెలుసుకోండి: