టాలీవుడ్ లో నిత్యం వివాదాలను సృష్టించే దర్శకుడు ఎవరు అని అడగ్గానే మనకి ఠక్కున గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. అవును తాను తీసే సినిమాలనుండి మాట్లాడే మాటల వరకు ప్రతీ ఒక్కటి పెద్ద దుమారాన్నే లేపుతాయి. ఇక తాను చెప్పదలిచినది మొహమాటం లేకుండా చెప్పేయడం వల్ల ఆ వివాదాలు ఇంకా పెద్దదవుతాయి. మీ చావు మీరు చావండి నేను ఇలాగే ఉంటా అనే వ్యక్తిత్వం ఆయనది.

తాను పోర్న్ పట్ల, అమ్మాయిల పట్ల ఎంత ఆసక్తి చూపుతాడో చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. అయితే ఈ ఆసక్తి ఏకంగా పోర్న్ సినిమాలలో నటించే నటితో తీసే వరకు వెళ్ళింది. ఇన్నాళ్లు యదార్థ సంఘటనలని, వ్యక్తుల జీవిత చరిత్రలని తెరెకెక్కించే వర్మ ఏకంగా పోర్న్ స్టార్తో ఒక వీడియో షూట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ పోర్న్ స్టార్ ఎవరో కాదు అమెరికన్ అశ్లీల చిత్రాల నటి మియా మాల్కోవా. శృంగారంపై మరియు తన దేహంపై ఆమె తన భావాలను చెప్పడమే ఈ వీడియో నేపథ్యం.

ఆధ్యాత్మిక భావాలు కలిగిన భారతదేశములో పోర్న్ చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా దానిని ఎవరు బహిరంగంగా చెప్పుకోరు. కాగా ఈ సినిమాకు కూడా విమర్శకుల తాకిడి ఎక్కువయింది. అసలు పోర్న్ వీడియో తీసి సమాజానికి ఏం సందేశం ఇస్తావు అని వర్మను అందరూ ఒక ఆటాడేసుకుంటున్నారు. పాపం వీటన్నిటితో విసుగెత్తిపోయినట్లున్నాడు వర్మ. తన సినిమా నిరసనకారులందరిని చావబాదుతున్నట్లుగా ఒక వీడియో ని నెట్లో వదిలాడు. కాగా ఈ వీడియో కు గాడ్,సెక్స్ అండ్ ట్రూత్ ని విమర్శలు చేస్తున్న వారి బెండు తీస్తున్నాను అని కాప్షన్ కూడా పెట్టాడు. వర్మ పైత్యాలలో ఇదొకటి అని కొందరు అనుకుంటుండగా, పబ్లిసిటీ కోసం వర్మ ఏదయినా చేస్తాడని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు.