రాజకీయాల పేరు చెపితే ఆమడదూరంలో ఉంటాడు మహేష్. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేకహోదా ఉద్యమం గురించి మహేష్ ఎందుకు స్పందించడు అంటూ ఎందరో ఘాటైన సెటైర్లు వేస్తూ ఉన్నా అవన్నీ తనకు సంబంధించినవి కావు అన్నట్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తన పై విమర్శలు చేస్తున్నవారికి షాకింగ్ రిప్లయ్ మహేష్ ఇచ్చాడు అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
MAHESH LATEST PHOTOS IN BHARATH ANE NENU కోసం చిత్ర ఫలితం
రెండు ఘోర పరాజయాల తరువాత మహేష్ నటిస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీకి మన ఇరు రాష్ట్రాలలోని బిసి సెంటర్ల నుండి వస్తున్న బిజినెస్ ఆఫర్స్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ బిజినెస్ క్రాస్ చేసింది అని అంటున్నారు. ‘స్పైడర్’ లాంటి ఘోర పరాజయం తరువాత కూడ కేవలం మహేష్ స్టామినాను నమ్ముకుని ఈ సమ్మర్ రేసుకు విడుదల అవుతున్న మిగతా హీరోల సినిమా స్థాయిని కూడ పట్టించుకోకుండా ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ చేస్తున్న బిజినెస్ నాన్ ‘బాహుబలి’ ఇండస్ట్రీ రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది అని అంటున్నారు. 
MAHESH LATEST PHOTOS IN BHARATH ANE NENU కోసం చిత్ర ఫలితం
దీనితో ఈమూవీ ఈ ఏడాది సమ్మర్ సీజన్ కు అత్యంత భారీ బిజినెస్ చేసిన సినిమాగా మరొక రికార్డ్ క్రియేట్ చేసింది అని అంటున్నారు. ఇప్పటికే ఈమూవీ ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్న నేపధ్యంలో ఏమాత్రం పాజిటివ్ టాక్ ఈసినిమాకు వచ్చినా ఇండస్ట్రీ రికార్డులను ‘భరత్ అనే నేను’ తిరగ వ్రాయడం ఖాయం అని అంటున్నారు. 
MAHESH LATEST PHOTOS IN BHARATH ANE NENU కోసం చిత్ర ఫలితం
గుంటూరు దగ్గరలో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపిన చోటే ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఘనంగా జరపాలని మహేష్ బావ గల్లా జయదేవ్ తో పాటు అనేకమంది తెలుగుదేశ ప్రముఖులు ఒత్తిడి చేయడమే కాకుండా దానికి కావాల్సిన అనుమతులు కూడా తీసుకున్నా మహేష్ సున్నితంగా ఈ ఫంక్షన్ ప్రపోజల్ ను తిరస్కరించి ఈ ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించమని నిర్మాతలను కోరడం వెనుక మహేష్ తాను అందరివాడిని అని చెప్పే సంకేతాలు ఉన్నాయి అని అంటున్నారు. మహేష్ కెరియర్ కు పరీక్షగా మారిన ఈమూవీ విషయంలో మహేష్ చాల ఆచీతూచి అడుగులు వేస్తూ తమ విమర్శకులకు ఘాటైన సమాధానం తన చర్యల ద్వారా ఇస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: