లారెన్స్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమా రెబల్. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. కాగా, రెబల్ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నాడు. 9 కోట్ల రూపాయిల ఫ్యాన్సీ రేటు చెల్లించి దిల్ రాజు ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు. ఇది ప్రభాస్ గత చిత్రాలతో పోలిస్తే అత్యధిక ధరగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రభాస్ ఇటీవల చిత్రాలు డార్లింగ్, మిస్టర్ ఫరఫెక్ట్ లను కూడా నైజాంలో దిల్ రాజ పంపిణీ చేశాడు. ఆ చిత్రాలు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ఆ నమ్మకంతోనే దిల్ రాజు రెబల్ హక్కులను భారీ రేటుకు సొంతం చేసుకున్నాడని సినీ మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: