తెలుగు కుర్రకారుకు అందాల ఛార్మిని గుర్తు చేయగానే వారికి గుమ్మడి పండు వంటి ఓ ముద్దుగ్ముమ్మ గుర్తుకు వస్తుంది. అలా నిండుగా కనిపించే ఛార్మికి అవకాశాలు ఇప్పడు పూర్తిగా తగ్గిపోయాయి. కాగా, ఇటీవల జరిగిన శ్రీమన్నారాయణ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకను చార్మి హాజరైయింది. గతంలో ఎన్నడూ లేనంతగా స్లిమ్ గా ఛార్మి కనిపించింది. అందరినీ తన క్యూట్ లుక్ తో ఆకట్టుకున్న ఛార్మీ గతంలో కంటే 20 కేజీలు బరువు తగ్గానని తెలిపింది. బరువు తగ్గిన ఛార్మి మళ్లీ సినిమాల్లో సందడి చేస్తే బావుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: