‘ఇస్మార్ట్ శంకర్’ ఘన విజయంతో తిరిగి ట్రాక్ లోకి వచ్చిన రామ్ ఈసినిమా విడుదలైన రెండువారాల వరకు ఎక్కడా బయటకు కనిపించలేదు. ఈమూవీ విడుదలకు ముందురోజు స్పెయిన్ వెళ్ళిపోయిన రామ్ ఈమూవీ ప్రమోషన్ కు కూడ దూరంగా ఉన్నాడు. అయితే గతవారం తన హాలిడే ట్రిప్ నుండి తిరిగి వచ్చిన రామ్ కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. 

గత ఆదివారం ‘బిగ్ బాస్’ షోలో అతిధిగా కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు. అయితే రామ్ ప్రస్తుతం ఎప్పుడు బయటకు వస్తున్నా తన తల పై ఒక హ్యాట్ పెట్టుకుని సందడి చేస్తూ ఉండటంతో రామ్ కు ఈ హ్యాట్ సెంటిమెంట్ ఏమిటి అంటూ చర్చలు మొదలయ్యాయి. కొందరు రామ్ తలకు స్పెయిన్ లో చిన్న గాయం అవ్వడంతో ఇలా ఎవరికీ తెలియకుండా హ్యాట్ తో కవర్ చేస్తున్నాడు అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. 

మరికొందరైతే రామ్ కు ఈమధ్య బట్టతల మొదలైందని అందువల్ల ఆ విషయాన్ని కవర్ చేయడానికి ఇలా హ్యాట్ పెట్టుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఎక్కడ విన్నా రామ్ హ్యాట్ గురించి ఊహాగానాలే వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ‘ఇస్మార్ట్ శంకర్’ తో మారిపోయిన రామ్ క్రేజ్ ఉపయోగించుకోవాలని అతడి ఇంటి వద్ద క్యూ కడుతున్న దర్శకులను చూసి రామ్ కూడ ఆశ్చర్యపడుతున్నట్లు టాక్. 

తనకు కెరియర్ బ్రేక్ ఇచ్చిన పూరీతో మరో సినిమాను చేయకుండా  రామ్ త్వరలో నటించబోతున్న ‘తడం’ రీమేక్ కు సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈమూవీ కథ అన్నదమ్ముల మధ్య నడిచే క్రైమ్ డ్రామా అని తెలుస్తోంది. ఇందులో కూడ రామ్ పాత్ర కొంత నెగిటివ్ షేడ్ లో ఉంటుంది. అయితే రామ్ కు కొత్తగా వచ్చిన ఇమేజ్ రీత్యా ఇలాంటి కథ సెట్ అవుతుందా అన్న సందేహాలు కొనసాగుతున్న పరిస్థితులలో త్వరలోనే రామ్ ఈమూవీ రీమేక్ కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: