కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సక్సెస్ ఫుల్ డైరక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ బిగిల్. ఈ సినిమాను తెలుగులో విజిల్ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. సినిమాను తెలుగులో మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు. బిగిల్ ట్రైలర్ కొద్దిరోజుల క్రిందట రిలీజ్ అవగా లేటెస్ట్ గా ఆ సినిమా తెలుగు వర్షన్ విజిల్ ట్రైలర్ రిలీజైంది. 


ఎప్పటిలానే విజయ్ స్టామినా ఏంటో చూపించే సినిమాగా విజిల్ వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా విజయ్ ఇందులో 3 పాత్రల్లో కనిపిస్తున్నాడు. బిగిల్ గా ఫుట్ బాల్ ప్లేయర్ గా.. రాజప్పతో పాటుగా మోడ్రెన్ లుక్ లో కనిపిస్తున్నాడు. మరి ముగ్గురు ఆడే ఆట ఎలా ఉంటుందో దీవాళికి వెండితెర మీద చూడాల్సిందే.


ఈ సినిమా తమిళ ట్రైలర్ లానే తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ దీవాళికి విజయ్ పక్కా హిట్టు కొట్టేలా ఉన్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోని లొసుగులతో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది. అట్లీతో విజయ్ కు ఇది మూడవ సినిమా. తెరి, మెర్సల్ తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా ఏ.ఆర్.రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో దీవాళి కానుకగా రిలీజ్ అవుతున్న విజిల్ సినిమా విజయ్ సత్తా చాటేలా ఉంటుందని అంటున్నారు. తుపాకి తర్వాత విజయ్ సినిమాలేవి తెలుగులో పెద్దగా ఆడలేదు. మెర్సల్, సర్కార్ సినిమాలు కూడా తెలుగులో వచ్చినా యావరేజ్ గా ఆడాయి. మరి విజిల్ ఫలితం ఎలా ఉంటుందో మరో 10 రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది. ట్రైలర్ చూస్తే మాత్రం ఈసారి తెలుగులో కూడా విజయ్ హిట్టు కొట్టేలా ఉన్నాడని అనిపిస్తుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: