ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘జాన్’ కథ అంతా యూరప్ నేపధ్యంలో జరుగుతుంది. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ పూర్తిగా యూరప్ లో తీయాలని భావించారు. అయితే ‘సాహో’ నేర్పిన గుణపాఠాలతో తన మనసు మార్చుకుని రామోజీ ఫిలిం సిటీలోని కొంత ప్రాంతాన్ని యూరప్ గా భావిస్తూ గ్రాఫిక్స్ సహకారంతో యూరప్ వాతావరణం కనిపించే విధంగా ఇక్కడే షూటింగ్ చేయాడానికి యూరప్ సిటీని పోలిన ఒక సెట్ వేసారు.

మూవీ యూరప్ వాతావరణంలో ఉంటుంది కాబట్టి సహజత్వం కోసం సుమారు 100 మంది జూనియర్ ఆర్టిస్ట్ లను యూరప్ నుండి ప్రత్యేకంగా తీసుకు వచ్చి వారి మధ్య ఈ యూరప్ బిల్డింగ్స్ ను పోలిన సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయట పడింది. 

ఈ మూవీలో ప్రభాస్ హస్త సాముద్రికం చెప్పే వ్యక్తిగా కనిపిస్తాడని తెలుస్తోంది. కథ రీత్యా ప్రభాస్ చిన్నతనంలోనే యూరప్ వెళ్లిపోవడంతో అక్కడ హస్త సాముద్రికం నేర్చుకుని తన విద్యతో చాలామంది అమ్మాయిలను పడేసే ఒక ప్లే బాయ్ గా కొన్ని సీన్స్ లో ప్రభాస్ కనిపించ బోతున్నాడని సమాచారం. 

దీనికోసం హస్త సాముద్రికం చెప్పే కొంతమంది జ్యోతిష్కుల దగ్గర బాడీ లాంగ్వేజ్ ని అదేవిధంగా వారి మాట తీరును ప్రభాస్ కు ప్రత్యేకంగా నేర్పించారు అని కూడ తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న పూజ హెగ్డే ప్రభాస్ చెప్పే జ్యోష్యం నమ్మి చేసే వింత పనులు కామెడీగా ఉంటాయని అంటున్నారు. చాల కాలం తరువాత ప్రభాస్ తన కామెడీ యాంగిల్ ను ఈ మూవీలో చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ మూవీని వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు విడుదల చేయాలి అన్న గట్టి పట్టుదలతో ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: