‘అల వైకుంఠపురములో’ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఈ మూవీ ఎడిటింగ్ విషయంలో త్రివిక్రమ్ శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాకు అనుకున్న బడ్జట్ కన్నా ఖర్చు చాల ఎక్కువ కావడంతో ఈ మూవీని అత్యంత భారీ రేట్లకు అమ్మవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటారు. 

దీనితో ఈ మూవీని కొనుక్కునే బయ్యర్లు అనుకోని పరిస్థితులలో ఈ మూవీ లాభాల బాట పట్టకపోతే తమకు నష్ట పరిహారం ఏరేంజ్ వరకు ఉంటుంది అన్న విషయమై ఇప్పటికే ఈ మూవీని నిర్మించిన రాధాకృష్ణను అదేవిధంగా అల్లు అరవింద్ ను కొంతమంది ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు కొన్ని గ్యారెంటీలను అడుగుతున్నట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఈ మూవీ ఎడిటింగ్ విషయంలో కూడ కొన్ని సమస్యలు ఎదురౌతున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ రన్ టైమ్ ను 180 నిముషాలు ఉండేలా త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్లు టాక్. అయితే అల్లు అరవింద్ మాత్రం ఈ మూవీ రన్ టైమ ను కనీసం 20 నిషాముఃలు తగ్గించమని త్రివిక్రమ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే త్రివిక్రమ్ మాత్రం ఇలా మూవీ రన్ టైమ్ ను పూర్తిగా కుదించి వేస్తే కథలో క్లారిటీ లోపించి అసలుకు మోసం వస్తుందని అరవింద్ అభిప్రాయంతో విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయమై అనేక లోతైన చర్చలు జరిపిన తరువాత మధ్యమార్గంగా ఈ మూవీ నిడివిని 160 నిముషాలకు కుదించేలా ఒక అంగీకారం కుదిరినా ఈ విషయమై త్రివిక్రమ్ పూర్తిగా ఇష్టపడటం లేదు అన్న ప్రచారం కూడ జరుగుతోంది. దీనితో ఈ గందరగోళాల మధ్య ఎడిటింగ్ విషయంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా అది ‘అల వైకుంఠపురములో’ కు శాపంగా మారితుందని ఈ మూవీని భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు చాల కలవర చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా బయటకు వస్తున్న ఈ లీకులను చూసి బన్నీ అభిమానులు విపరీతమైన టెన్షన్ పడుతున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: