యంగ్ హీరో సుధీర్ బాబు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి దాదాపు 9 సంవత్సరాలు అవుతున్నా ఇంకా సరైన బ్రేక్ రావడం లేదు. అతడి సినిమాల ఫంక్షన్స్ కు మహేష్ ను అతిధిగా తీసుకు వచ్చి మహేష్ అభిమానులకు కనెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నా మహేష్ అభిమానులు మాత్రం సుధీర్ బాబు సినిమాలతో కనెక్ట్ కాలేకపోతున్నారు.
నిన్న జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్ లో సుధీర్ బాబు మహేష్ ను టార్గెట్ చేస్తూ వేసిన జోక్ చాలామందికి నవ్వును తెప్పించింది. మహేష్ సినిమా ఫంక్షన్స్ కు రావడం అంటే తనకు ఒక సమస్య అని చెపుతూ మహేష్ ను పొగిడితే అతడికి నచ్చదనీ అతడిని పొగడకపోతే అభిమానులకు నచ్చదు అంటూ తనకు ఏర్పడ్డ ఒక వింత సమస్యను బయట పెట్టాడు.
వాస్తవానికి సుధీర్ బాబు తన సొంత నిర్మాణ సంస్థలో మహేష్ తో సినిమా తీయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అదేవిధంగా మహేష్ సోదరి మంజుల కూడ మహేష్ తో తన బ్యానర్ పై సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే మహేష్ మాత్రం తన డేట్స్ తన వారికి ఇవ్వకుండా బయట నిర్మాణ సంస్థలకు ఇస్తూ చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు.
అంతేకాదు మహేష్ సోదరి మంజుల దర్శకురాలుగా మారిన తరువాత మహేష్ తో ఆమె ఒక సినిమా తీయాలని ప్రయత్నిస్తున్నా మహేష్ తన స్వీట్ స్మయిల్ తో తన కుటుంబ సభ్యులకు కూడ తన అభిప్రాయాలను బయటపడనీయకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అందుకే మహేష్ చిరునవ్వులో అనేక అర్ధాలు ఉంటాయని ‘దొంగ’ అంటూ చిరంజీవి నిన్నటి ఈవెంట్ లో ఓపెన్ గానే చెప్పాడు. మీడియా వర్గాలు సుధీర్ బాబు గురించి వార్తలు రాస్తూ మహేష్ బావ అన్న పదం రాస్తే సుధీర్ బాబు అలా వార్తలు రాసిన వారికి గతంలో క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. దీనితో మహేష్ తో సుధీర్ బాబుకు నిజంగానే సమస్యలు ఉన్నాయి అని అనిపిస్తుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి