సినీ ఇండస్ట్రీ అంటేనే సరదా అయిపోయింది.. ఎంట్టైన్మెంట్ కోసం సినిమాలు చేస్తే కొందరు మాత్రం ఎంజాయ్ కావాలని సినిమాలు చేస్తుంటారు..ఇకపోతే సినిమా సినిమాకు బట్టలు మార్చినట్లు బాయ్ ఫ్రెండ్ నీ కూడా మారుస్తున్నారు . అందుకే డేటింగ్ పేరుతో ఎక్కడ పడితే అక్కడ మీడియా కు చిక్కడం మళ్లీ వార్తల్లో తెగ ట్రైల్స్ వేయించుకోవడం ఇవన్నీ ఈ రోజుల్లో కామన్ అయిందనుకొంది...

 

అసలు విషయానికొస్తే సినీ తారలు చాలామంది ఒకరికి మించి మరొకరు బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటేన్ చేస్తుంటారు..అయితే అది కూడా ఒక ఏజ్ వరకు ఉంటే అదే కొంచం అందంగా ఉంటుంది.. కానీ, వయసు మొత్తం అయ్యాక అది కూడా 56 ఏళ్ల వయసులో కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది.. ఎవరైనా చూసినా కూడా ఎదో అనుకుంటారు.. అని కూడా లేకుండా ఓ సెలబ్రెటీ 56 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్దమయింది.. 

 

వివరాల్లోకి వెళితే..హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ అనే నటి ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారట.. అందులోనూ 52 ఏళ్ల వయసులో.1995లో టామీ లీ అనే నటుడ్ని పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లకే అతనితో విడిపోయారు. ఆ తర్వాత కిడ్ రాక్ అనే మరో వ్యక్తిని పెళ్లాడారు. ఈ పెళ్లీ నిలవలేదు. మూడోసారి పోకర్ ప్లేయర్ రిక్ సాలోమన్‌ను వివాహం చేసుకున్నారు. ఇతనితో విడిపోయి మళ్లీ కలిసిపోయి మళ్లీ అతన్నే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ విడిపోయారు. ఇప్పుడు హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్స్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మలీబూలో నిన్న వీరి వివాహం జరిగిందట.

 

అయితే అతనితో 36 ఏళ్ల నుండి సహజీవనం చేస్తూ ఉన్నదట .. దానితో ఇంకా పెళ్లి చేసుకోవాలని అనుకుందట..తన చుట్టూ ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఉన్నప్పటికీ తనకు పమేలాతోనే జీవితాన్ని పంచుకోవాలని ఉండేదని తెలిపారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జాన్ పీటర్స్‌కి కూడా ఇది ఐదో పెళ్లే. అతని చివరి వివాహ బంధం 2014లో ముగిసింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన ‘బేవాచ్’ సినిమాలో పమేలా కీలక పాత్రలో నటించారు... అదండీ అలా వీరిద్దరు ఒక్కటయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి: