సినిమాల పరంగా రాజకీయాల పరంగా బాలకృష్ణ తన కెరియర్ లో ఎప్పుడు చూడని డల్ పీరియడ్ ప్రస్తుతం చూస్తున్నాడు. హీరోగా బాలయ్య పని అయిపోయింది అని వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ను తట్టుకోలేకపోతున్న బాలయ్య తన సినిమాల  విషయంలో మరింత వేగం పెంచుతున్నాడు. 


ప్రస్తుతం బోయపాటి తో ఒక పవర్ ఫుల్ మూవీని చేస్తున్న బాలకృష్ణ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఒకనాటి టాప్ డైరెక్టర్ బి. గోపాల్ తో సినిమా చేయడానికి అంగీకరించడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. గతంలో బాలకృష్ణకు కెరియర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన సెంటిమెంట్ రిపీట్ చేయాలని ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ బాలకృష్ణ కోసం వ్రాసిన ఒక హెవీ సెంటిమెంట్ స్టోరీకి బాలయ్య ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. 


ఈ మూవీలో బాలకృష్ణ 60 సంవత్సరాలు పై బడిన వ్యక్తిగా కనిపిస్తూ నేటి తరం అభిరుచులను అర్ధం చేసుకోలేక మారుతున్న విలువలతో రాజీ పడలేకపోయే ఒక తండ్రి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ పాత్రలో చాల షేడ్స్ ‘శతమానం భవతి’ మూవీలోని ప్రకాష్ రాజ్ పాత్ర ఛాయలలో ఉంటుంది అని అంటున్నారు. 


గతంలో బాలకృష్ణ సమిష్టి కుటుంబ నేపద్యంలో తీసిన ‘అన్నయ్య’ అన్న మూవీలో నటించాడు. ఆ మూవీ అప్పట్లో మంచి విజయాన్ని కూడ సాధించింది. ఇప్పుడు బాలకృష్ణ కు మళ్ళీ పాత రోజులు గుర్తుకు రావడంతో ఇలా బి. గోపాల్ తో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు అనుకోవాలి. బాలయ్యను వయసుకు తగ్గ పాత్రలను ఎన్నుకోమని సలహాలు పెరిగిపోతున్న పరిస్థితులలో ఇలాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీకి బాలయ్య ఓకె చెప్పాడుఅని టాక్. ఒకవైపు బోయపాటి తో పక్కా మాస్ మూవీ మరొక వైపు బి. గోపాల్ తో ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీలను నటిస్తూ ఈ రెండు సినిమాలతో అయినా తన కెరియర్ చక్కబడుతుందని బాలకృష్ణ భావిస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: