తెలుగు, తమిళ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విశాల్.  అచ్చమైన తెలుగు అబ్బాయి అయిన విశాల్ కెరీర్ మాత్రం తమిళ్ లోనే ప్రారంభించి.. ఇక్కడ పందెం కోడి చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు.  అప్పటి నుంచి వరుసగా తన చిత్రాలు డబ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  నిజంగానే విశాల్ అసలు తెలుగు హీరోనేనా అన్నంతాగా ప్రేక్షకాదరణ పొందాడు.  ఆ మద్య విశాల్ ‘డిటెక్టీవ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తమిళ్ వర్షన్ తుప్పరివాలన్ ని తెలుగు లో డిటెక్టీవ్ గా డబ్ చేశారు.  తాజాగా తమిళ నటుడు విశాల్ కొత్త చిత్రం `తుప్పరివాలన్-2` (`డిటెక్టివ్`కు సీక్వెల్) వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 

 

ఈ చిత్రం నుంచి డైరెక్టర్ మిస్కన్ తప్పుకున్న విషయం తెలిసిందే. దానికి కారణం ఈ చిత్రం అనుకున్న బడ్జెట్ కన్నా రూ.5 కోట్లు ఎక్కువ కావడం.. దానికి హీరో, నిర్మాత నిరాకరించడంతో పక్కకు తప్పుకున్నారట.  తాాజాగా ఈ విషయం పై విశాల్ స్పందిస్తూ.. ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకో భంగం కలిగించాలనే ఉద్దేశం లేదు. కొంత మంది వ్యక్తుల విషయంలో నిర్మాతలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పాలనేదే నా ఉద్దేం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ప్రొడక్షన్, షూటింగ్ సమయంలో కొన్ని తప్పిదాలను నేను ప్రశ్నించాను.. ఆ కారణంతోనే ఆయన తప్పుకున్నట్టుగా భావిస్తున్నానని అన్నారు. 

 

ఒక నిర్మాతగా తాను ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఆ దేవుడికే తెలుసు అని.. ఒక నిర్మాతగా చిత్రాన్ని నిర్మించడం ఎంత రిస్క్ అన్న విషయం ఆ బాధలుపడుతున్న వారికే తెలుసు అని అన్నారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించబోతున్నట్టు తెలిపాడు. ఈ చిత్రంతో డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నానని, అందరి అంచనాలను అందుకుంటానని తెలిపాడు. ఈ చిత్రం మరో విజయం సాధిస్తుందని నమ్మకం తనకు ఉందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: