టాలీవుడ్ ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌. ఎస్ . రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. డీవీవీ ఎంట‌ర్టైన్ మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్ప‌టికే యేడాదికి పైగా షూటింగ్ జ‌రుపు కుంటోంది. ఆర్.ఆర్.ఆర్ వ‌ర్కింగ్ టైటిల్‌తో ప్రారంభ‌మైన ఈ సినిమా గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ లేదు. టాలీవుడ్ యంగ్ హీరోలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమ‌రం భీం గాను... రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగాను న‌టిస్తున్నారు.

 

ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో గిరిజన నాయ‌కుడిగా ఉన్న కొమ‌రం భీం అప్ప‌టి నైజాం అరాచ‌కాల‌పై పోరాటం చేశాడు. ఇక అల్లూరి సీతారామ‌రాజు ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా రంప‌చోడ‌వ‌రం ఏజెన్సీలో అప్ప‌టి బ్రిటీష్ దొర‌ల‌పై పోరాటం చేశాడు. వీరిద్ద‌రికి ఉన్న కామ‌న్ పాయింట్ గిరిజ‌నుల‌ను ఏకం చేసి ఫైట్ చేయ‌డ‌మే. ఇక ఈ ఉగాది రోజున ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తోన్న అజ‌య్ దేవ‌గ‌ణ్ పాత్ర‌పై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇక ఉగాది కానుక‌గా రిలీజ్ అయిన మోష‌న్ పోస్ట‌ర్‌లో ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు. రౌద్రం ర‌ణం రుధిరం టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇక మోష‌న్ పోస్ట‌ర్ చాలా భీక‌రంగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ సినిమా ఇప్ప‌టికే వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. తాజాగా టైటిల్ రివీల్‌తో సినిమాపై అదిరిపోయేచే అంచ‌నాలు ఉన్నాయి. మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ అయ్యిందే లేదో యూట్యూబ్‌లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. మెగా అభిమానులు.. నంద‌మూరి, ఎన్టీఆర్ అభిమానులు భీభ‌త్స‌వంగా వైర‌ల్ చేస్తున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆలియాభ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలివీయా మోర‌స్ న‌టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: