నిన్న స్తబ్దంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులను ఒకేసారి ఊహించని విధంగా విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ మోషన్ పోష్టర్ ను చూసి జోష్ లోకి వెళ్ళిపోయారు. దీనికితోడు ఈ మోషన్ పోష్టర్ లో ఈ మూవీ విడుదల తేది జనవరి 8న 2021 అని మళ్ళీ రాజమౌళి ప్రకటించడంతో ఎన్ని కరోనా అవాంతరాలు వచ్చినా ఈమూవీ విడుదల మరొకసారి వాయిదా పడదు అన్న క్లారిటీ వచ్చింది. 

 

చాలా రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పదాల్నే ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ గా మార్చి ‘రామ రౌద్ర రుదిరం’ అంటూ జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ మోషన్ పోష్టర్ కు విపరీతమైన స్పందన కొద్ది గంటలలోనే వచ్చినా ఈ మూవీలో రాజమౌళి పరోక్షంగా ఎంచుకున్న పంచభూతాల కాన్సెప్ట్ ఫై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

 

ఈ మోషన్ పోష్టర్ ను నిశితంగా పరిశీలించిన వారికి మన హిందూ మతంలోని పంచ భూతాల సిద్దాంతం పరోక్షంగా స్పురణకు వస్తుంది. మన పూర్వీకులు మనలను శాసించే పంచ భూతాలుగా అగ్ని ఆకాశం నీరు భూమి గాలి లను గుర్తించడమే కాకుండా ఆ శక్తులకు ఒక పవిత్రతను ఆపాదించి వాటిలి మనం పూజించే విధంగా మన వేదాలు అనేక విషయాలను తెలియచేసాయి. 

 

రామ్ చరణ్ ను ఫైర్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ను వాటర్ బ్యాక్ డ్రాప్ లో చూపిస్తున్న ఈ మోషన్ పోష్టర్ చూసిన వారికి నాస్తికుడు అయిన రాజమౌళి తిరిగి పంచ భూతాల శక్తిని గురించి ఈ మూవీలో పరోక్షంగా తెలియ చేస్తాడా అని అనిపించడం సహజం. దీనితో ఈ పంచ భూతాల కాన్సెప్ట్ కు ఈమూవీలోని చరణ్ జూనియర్ ల పాత్రలకు ఎదో అవినాభావ సంబంధం ఉండి ఉంటుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: