ప్రజలను కరోనా సమస్య పై చైతన్యవంతం చేయడానికి హీరోలు వీడియోలు ద్వారా తమ సందేశాలు ఇస్తూ తమతమ స్థాయిలలో విరాళాలు ఇస్తున్నారు. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్ మటుకు తమవంతు సహాయంగా డబ్బు విరాళంగా ఇవ్వకుండా కరోనా పై ఒక పాటను కంపోజ్ చేసి ఛానల్స్ ద్వారా విడుదల చేస్తూ ఈ కరోనా గ్యాప్ లో కూడ తమ ఉనికిని చాటుకుంటున్నారు.


ఇప్పటికే కోటి వందేమాతరం శ్రీనివాస్ కరోనా పై ప్రచార గీతాలను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటే ఇప్పుడు ఈ లిస్టులోకి కీరవాణి కూడ చేరిపోయాడు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సినిమాకు రెండు కోట్ల పారితోషికం కీరవాణి తీసుకుంటాడు అన్న ప్రచారం ఉంది. 


దీనికితోడు కీరవాణి భార్య రాజమౌళి టీమ్ లో కీలక సభ్యురాలుగా వ్యవహరిస్తూ రాజమౌళి తీసే భారీ మూవీ ప్రాజెక్ట్స్ కు సంబంధించి కూడ భారీగా పారితోషికాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితులలో కరోనా పై పాటలు పాడే బదులు ఉన్నత స్థితిలో ఉన్న కీరవాణి లాంటి ప్రముఖ వ్యక్తి ఇండస్ట్రీకి సంబంధించి మ్యూజిక్ విభాగంలో షూటింగ్ షట్ డౌన్ వల్ల అవకాశాలు లేక రోజువారి పారితోషికం పై పనిచేస్తూ ప్రస్తుతం ఇబ్బందులలో ఉన్న మ్యూజిక్ కళాకారులను ఆడుకోవచ్చు కదా అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు.


అయితే కీరవాణి ఎవరి మాటను వినే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. అందువల్లనే తన దగ్గర ఉన్న పాత మ్యూజిక్ ట్రాక్ కు రీమిక్స్ గీతం అల్లి ఇదే తన సేవా అంటూ కీరవాణి తన వంతు సేవను బయటపెట్టాడు. ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది హీరోలు తప్ప కేరెక్టర్ ఆర్టిస్టులు కాని టాప్ హీరోయిన్స్ కాని ఒక్క రూపాయి విరాళం ఇవ్వకుండా తమ మౌనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులలో మన టాప్ హీరోయిన్స్ కి అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకి జనం కష్టాలు పట్టవా అంటూ కామెంట్స్ వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: