ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలు పెరుగని పోరాటం చేస్తున్నాయి. దేశమంతటా వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  అయితే గత నెల 24 నుంచి లాక్ డౌన్ లో ఉన్న విషయం తెలిసిందే..దాంతో సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ కార్మికులు నానా కష్టాలు పడుతున్నారు. షూటింగ్స్ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక పని ఉండటం.. డబ్బులు రావడం జరుగుతుంది. ఇప్పుడు షూటింగ్స్ ఆగిపోవడంతో ఏక్కడా పనిదొరక్క కష్టాలు పడుతున్నారు.

 

అలాంటి వారి కోసం మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనుసు చేసుకొని కోటి రూమాలు విరాళం ఇవ్వడమే కాదు..‘కరోనా క్రైసిస్ చారిటీ  ఏర్పాటు చేసి నిధులు సేకరిస్తున్నారు.  దీనికి ఎంతో మంది సెలబ్రెటీలు విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారు..దాంతో ఎంతో మంది కార్మికులకు నిత్యావసర వస్తువుల, నగదు డబ్బు ఇస్తున్నారు.   తెలుగు రాష్ట్రాలలో ఉన్న సినీ కార్మికుల కోసం బిగ్ బి అందించిన సహాయానికి బిగ్ థ్యాంక్స్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసారు.

 

అందులో... అమితాబ్ గారు మీ  కుటుంబం ద్వారా వచ్చిన ఆదాయం నుండి తెలుగు రాష్ట్రాల్లోని డైలీ వేజ్ ఫిల్మ్ వర్కర్లకు పంపిణీ చేయడానికి ఒక్కొక్కటి రూ .1500 చొప్పున 12000 కరోనా రిలీఫ్ కూపన్లను ఏర్పాటు చేసారు. ఈ అద్భుతమైన చొరవ కోసం 'బిగ్ బి'కి ధన్యవాదాలు" అని తెలిపారు. ఈ మొత్తం కూపన్స్ విలువ 1.8 కోట్లు అని సమాచారం.  చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ అమితాబ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: