ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా బయోపిక్ ల  హవా ఎక్కువగా నడుస్తున్న విషయం తెలిసిందే. బయోపిక్ లకు అటు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ వస్తుండడంతో బయోపిక్ లు  తెరకెక్కించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు దర్శక నిర్మాతలు. అంతే కాకుండా కొత్తగా ఒక కథ రాసుకునే పని లేక పోవడం ఉన్న కథలోని కొన్ని మార్పులు చేర్పులు చేయడం... సులభంగా బయోపిక్లు తెరకెక్కించడం చేస్తున్నారు దర్శకులు. ఇప్పటివరకూ సినీ క్రీడా రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు బయోపిక్లు తెరకెక్కాయి. కొన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాదిస్తే కొన్ని మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. 

 

 ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసిన టాలీవుడ్ ఫస్ట్ బయోపిక్ మహానటి. ఆనాటి స్టార్ హీరోయిన్ వైవిధ్యమైన నటి,  గొప్ప మహిళా మూర్తి అయిన  సావిత్రమ్మ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు  నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో మహానటి సావిత్రమ్మ పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది . సినిమాలో సావిత్రి పాత్రలో  కీర్తి సురేష్ ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది అనే చెప్పాలి. సావిత్రమ్మ పేరు చెప్పగానే కీర్తి సురేష్ గుర్తొచ్చేలా... మహానటి సినిమాలో కీర్తి సురేష్ పాత్రను  ప్రభావితం చేసింది. 

 

 

 అయితే మహానటి బయోపిక్ విషయంలో మొదటి నుంచి అనుకున్నదే జరిగింది. మహానటి బయోపిక్ అనుకోక ముందు నుంచే చాలా మంది సినీ ప్రేక్షకులకు పలు సందర్భాల్లో కీర్తి సురేష్ లో  మహానటి సావిత్రమ్మ పోలికలు కనిపించాయి. మహానటి సావిత్రి జీవిత చరిత్ర లో సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఎప్పటినుంచో అనుకున్నారు. ఇక దర్శక నిర్మాతలు కూడా మహానటి బయోపిక్లో సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేయడం... కీర్తి సురేష్ సావిత్రమ్మ పాత్రలో  ఒదిగిపోయి పాత్రకు ప్రాణం పోయడం... అంతా అనుకున్నట్లుగానే జరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: