నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ కి తెలుగు ప్రజల్లో ఉన్న ఖ్యాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రజలందరికీ ఆయన ఒక కారణజన్ముడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలుగువాడి సత్తాను ఎలుగెత్తి చూపి తెలుగు ప్రేక్షకులందరికీ ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు సీనియర్ ఎన్టీఆర్. ఇక సినిమాల్లో ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించి.. నిజమైన దేవుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ లాగె  ఉంటారేమో అనేంతగా ప్రజలను ప్రేక్షకులను ప్రభావితం చేశారు. ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి ఒక మహోన్నత వ్యక్తిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శం. అయితే ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక మహోన్నత సినీనటుడిగా ఒక గొప్ప ముఖ్యమంత్రిగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన సీనియర్ ఎన్టీఆర్.. తన పుట్టిన ఊరు పై మమకారాన్ని  మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. 

 

 మనం ఎంత ఎదిగాము  అన్నది కాదు మనం మూలాలు ఎక్కడ ఉన్నాయి అన్నది గుర్తుపెట్టుకున్న  వాడే మహోన్నత వ్యక్తి అవుతాడు అన్నది సీనియర్ ఎన్టీఆర్ నిరూపించారు. సీనియర్ ఎన్టీఆర్ నిమ్మకూరు లో జన్మించారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు లో జన్మించారు సీనియర్ ఎన్టీఆర్. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సీనియర్ ఎన్టీఆర్ మొదట ఎన్నో కష్టాలను అనుభవించారు. ఇక మొదట్లో చదువును కొనసాగించేందుకు ఏకంగా పాలు కూడా అమ్మారు . ఆ తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు సీనియర్ ఎన్టీఆర్. 

 

 

 ఇక నందమూరి తారకరామారావు ఇంటి పక్కనే ప్రస్తుతం విలక్షణ నటుడిగా కొనసాగుతున్న రాజేంద్రప్రసాద్ ఇల్లు కూడా ఉండేది. ఇక ఆ తర్వాత చదువు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. ఇక అక్కడి నుంచి సినిమాలపై ఆసక్తితో సినిమారంగానికి వెళ్లారు నందమూరి తారక రామారావు. ఇక నందమూరి తారక రామారావును చూసిన వెంటనే దర్శక నిర్మాతలందరూ గొప్పనటుడు అవుతావు అంటూ కితాబిచ్చారు. ఎన్టీఆర్ డెడికేషన్ కష్టపడే విధానం చూసి ఎన్నో ప్రశంసలు కురిపించారు. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో మహోన్నత వ్యక్తిగా ఒక గొప్ప నటుడిగా ఎదిగారు నందమూరి తారక రామారావు. ఆ తరువాత ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఒకప్పుడు కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న నిమ్మకూరు ప్రస్తుతం... పామర్ర  నియోజకవర్గంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: