శేఖర్ కమ్ముల.. ఎంత చెప్పిన తక్కువే.. ఎంత మాట్లాడిన తక్కువే.. అలాంటి అద్భుతమైన సూపర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఎన్నో అద్భుతమైన అందమైన ఫీల్ గుడ్ సినిమాలను మనకు అందించాడు. ప్రతి సినిమా ఒక అందమైన అనుభూతి ఇస్తుంది. అద్భుతమైన ఫీల్ ని ఇస్తుంది.. ఏమోషనల్ గా టచ్ చేస్తుంది. అలాంటి సినిమాలను మాత్రమే కాదు మంచి హీరోలను కూడా పరిచయం చేశాడు శేఖర్ కమ్ముల. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 

 

తమన్నా.. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలు అయితే చేసింది కానీ పెద్దగా ఫేమస్ కాలేదు. కానీ ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ లో హీరోయిన్ గా పరిచయం చేశాడు.. ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్ తమన్నా. 

 

కమలిని ముఖేర్జీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాతోనే టాలీవుడ్ లో సూపర్ లేడీ అయిపోయింది. ఇంకా ఆతర్వాత వచ్చిన గోదావరితో అందరి మనసు దోచేసుకుంది. 

 

రానా.. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న శేఖర్ కమ్ముల లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు విలన్ గా, హీరోగా అలరిస్తున్నా రానా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. 

 

ప్రియా ఆనంద్.. లీడర్ లో అల్లరి పిల్లగా మనకు పరిచయం అయ్యింది. 

 

రిచా గంగోపాధ్య.. రానా పక్కన సూపర్ హీరోయిన్ గా అప్పట్లో కనిపించింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మంచి స్టార్ అయ్యాక చదువు పేరుతో ఫారిన్ కి చెక్కేసింది. 

 

రాజా అబెల్.. ఆనంద్ సినిమాతో ఈ హీరోకి మంచి బ్రేక్ పడింది. అక్కడక్కడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ ఫార్మ్ లో లేడు. 

 

నిఖిల్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాలో నటించి అందరిని మాయమరిపించాడు. 

 

వరుణ్ సందేశ్.. ప్రస్తుతం ఫామ్ లో లేడు కానీ అప్పట్లో మంచి క్రేజ్ వచ్చింది. హ్యాపీ డేస్ తో పరిచయం అయ్యి తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. 

 

విజయ్ దేవరకొండ.. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో పొగరు అబ్బాయిగా కనిపించి అందరిని అలరించాడు. ఆతర్వాత పెళ్లి చూపులు, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాల్లో నటించాడు. 

 

సాయి పల్లవి.. ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడించి ఓ రేంజ్ కి వెళ్ళిపోయినా హీరోయిన్ సాయి పల్లవి. 

మరింత సమాచారం తెలుసుకోండి: