ప్రస్తుతం మహేష్ ఆశలన్నీ దసరాకు రాబోతున్న ‘ఆగడు’ సినిమా పైనే ఉన్నాయి. మండుతున్న ఎండలను కూడ లెక్క చేయకుండా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ‘ఆగడు’ షూటింగ్ షెడ్యూల్ లో ప్రిన్స్ మహేష్ కు దర్శకుడు శ్రీనువైట్లకు మధ్య చిన్న ఇగో ప్రాబ్లమ్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎపి హెరాల్డ్ కు తెలిసిన సమాచారం మేరకు ఈ సినిమా విషయంలో మహేష్ శ్రీనువైట్ల పై చేస్తున్న తీవ్ర ఒత్తిడి శ్రీనువైట్లకు అసహనాన్ని కలిగిస్తోంది అని టాక్. గతంలో శ్రీనువైట్లకు ఆస్థాన రచయితలుగా పనిచేసిన కోన వెంకట్, గోపీ మోహన్ లు కాకుండా కొత్త రచయితల టీమ్ తో ఈ సినిమా స్క్రిప్ట్ ను శ్రీను వైట్ల తయారు చేసి ఉండటంతో ఈ స్క్రిప్ట్ కు సంబంధించి షాట్ చిత్రీకరిస్తున్నప్పుడల్లా ఏదో ఒక సలహా మహేష్ ఇవ్వడమే కాకుండా ఈసినిమా సూపర్ హిట్ కొట్టి తీరాలి అని తరుచు మహేష్ శ్రీనువైట్ల పై ఒత్తిడి పెంచుతూ ఉండటంతో ఆ ఒత్తిడికి తట్టుకోలేక కావాలంటే మళ్ళీ రీ షూట్ చేద్దామా అని శ్రీనువైట్ల అనేటట్లుగా విసిగిపోయే స్థాయికి మహేష్ ఒత్తిడి పెరిగి పోయింది అంటు వార్తలు వస్తున్నాయి.
‘వన్’ పరాజయంతో మహేష్ కు ‘ఆగడు’ సినిమా పై టెన్షన్ ఉండటం సహజం అయినా మరీ అతి జాగ్రత్తలు తీసుకుంటే అసలుకే మోసం వస్తుంది అంటూ మహేష్ టెన్షన్ పై సెటైర్లు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: