ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ తో పాటు పలువురు బాలీవుడ్, హాలీవుడ్ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ని జరుపుకుంది. ఇక దీని అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై రాజమౌళి ఒక సినిమా తీయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్, దాని అనంతరం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ని తీసుకునేందుకు రాజమౌళి ఎంతో సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన స్టోరీ ప్రకారం ఆ పాత్రకు దీపికా అయితేనే న్యాయం చేయగలదని భావిస్తున్నారట రాజమౌళి. అయితే ఇప్పటికే అటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో పాటు అతి త్వరలో ప్రభాస్ సినిమాలో కూడా నటించనున్న దీపికా, ఈ సినిమాకు ఎంతవరకు సైన్ చేస్తారో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి