నటసింహం నందమూరి బాలకృష్ణ గత ఏడాది తన తండ్రి బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు చేసి వాటి ద్వారా ఘోరమైన పరాజయాలు అందుకున్నారు. అనంతరం తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన రూలర్ సినిమా కూడా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసు దగ్గర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇక ఈ మూడు పరాజయాల అనంతరం తదుపరి చేయబోయే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని సిద్ధమైన బాలయ్య తనకు గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీనుకు తన నెక్స్ట్ సినిమాకి దర్శకుడిగా అవకాశం కల్పించారు. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల బాలయ్య జన్మదినం సందర్భంగా రిలీజ్ అయి ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన రాబట్టింది. బాలయ్య రెండు పవర్ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో జరుగనుంది. దీనిని వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత గతంతో తనకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి పెద్ద విజయాలు అందించిన బి.గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమాని బాలయ్య చేయనున్నట్లు కొద్ది రోజులుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.
ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా కథని ఇటీవల ప్రారంభించిన బి.గోపాల్ అతి త్వరలో పూర్తి అయిన అనంతరం దానిని బాలయ్యకు వినిపించనున్నాడట. అయితే ఒకప్పుడు మాదిరిగా ప్రస్తుతం బి.గోపాల్ కెరీర్ ట్రాక్ రికార్డు బాగాలేదని మరి ఇటువంటి పరిస్థితుల్లో బాలయ్యతో ఆయన సినిమా చేస్తే అది ఏమవుతుందో ఏమో అంటూ కొందరు కొందరు నందమూరి ఫ్యాన్స్ భయపడుతున్నట్లు సమాచారం. అయితే ఈ స్క్రిప్ట్ విషయంలో అన్ని విధాల ఎంతో జాగ్రత్త వహిస్తున్న బి.గోపాల్ ఎలాగైనా దీనితో సక్సెస్ కొట్టి కెరీర్ పరంగా బ్రేక్ అందుకోవాలని చూస్తున్నారట. మరి అదే కనుక జరిగితే మరొకసారి బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్లో మంచి హిట్ సినిమాని మనం చూడవచ్చు.....!!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి