సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా ఏకే ఎంటర్టైన్మెంట్స్,  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి తొలి సినిమాతోనే భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఆ తర్వాత మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం సినిమా తీసి దానితో మరొక విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి ఆపై మాస్ రాజా రవితేజ తో రాజా ది గ్రేట్ అలానే వెంకటేష్, వరుణ్ తేజ్ ల కలయికలో తెరకెక్కిన ఎఫ్2 సినిమాలతో మరొక రెండు సూపర్ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నాడు.

వీటి అనంతరం మహేష్ తో ఆయన చేసిన సరిలేరు నీకెవ్వరు కూడా హిట్ కొట్టడంతో తన కెరీర్లో ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడిగా ప్రస్తుతం టాలీవుడ్లో అనిల్ రావిపూడి దూసుకెళ్తున్నారు. ఇకపోతే అతి త్వరలో ఆయన తెరకెక్కించనున్న లేటెస్ట్ సినిమా ఎఫ్3. గతంలో వెంకటేష్ ,వరుణ్ తేజ్ ల కలయికలో తెరకెక్కిన ఎఫ్2 కి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో వారిద్దరు తోపాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నట్లు టాక్. ఇక పోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అతి త్వరలో ఎఫ్3 సినిమా చేయనున్న అనిల్ రావిపూడి దాని అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమా చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అద్భుతమైన రేంజ్లో స్టోరీ సిద్ధం చేసుకున్న అనిల్ రావిపూడి కొద్ది రోజుల క్రితం దానిని మహేష్ బాబుకి వినిపించడం అది ఎంతో నచ్చిన మహేష్ వీలైనంత త్వరగా దానిని పట్టాలెక్కించేలా ప్లాన్ చేద్దాం అంటూ మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పట్టాలెక్కనుందని టాక్.

ఇకపోతే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి సక్సెస్ అందుకున్నప్పటికి కూడా మ్యూజికల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక అదే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా సక్సెస్ తో పాటు సాంగ్స్ పరంగా అద్భుతమైన రీతిలో రెస్పాన్స్ సంపాదించుకుని జాతీయ స్థాయిలో దూసుకెళ్లింది. అయితే ఈసారి మాత్రం తమా ఇద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ కొత్త సినిమాని మ్యూజికల్ గా కూడా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద సక్సెస్ చేసేలా పక్కాగా ప్రణాళిక రచిస్తున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే తప్పకుండా రేపు రిలీజ్ తర్వాత ఈ సినిమా అన్ని విధాలుగా భారీ సక్సెస్ కొట్టి అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మాత్రం అది నిజంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అతి పెద్ద పండుగ వార్త అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: