అల్లు అర్జున్ కాకుండానే అతడి కొడుకు అయాన్ కూతురు ఆర్ష కు కూడ సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా బన్నీ తన పిల్లలుచేత రకరకాల గెటప్స్ వేయిస్తూ వారి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి సందడి చేస్తూ ఉంటాడు.


తన కూతురు అర్ష పుట్టినరోజు సందర్భంగా బన్నీ షేర్ చేసిన అర్షాస్ అంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఆ వీడియోను డైరెక్ట్ చేసిన సాయి కి మంచి పేరు తీసుకుకు వచ్చింది. గతంలో సాయి త్రివిక్రమ్ శ్రెనివాస్ టీమ్ లో కీలక వ్యక్తిగా కొనసాగుతూ త్రివిక్రమ్ టీమ్ ను పర్యవేక్షించేవాడు.


అయితే కొంత కాలం క్రితం కొన్ని కారణాల రీత్యా త్రివిక్రమ్ టీమ్ నుండి బయటకు వచ్చి బన్నీ కాంపౌండ్ లో ఎంట్రీ సంపాదించి అల్లు అర్జున్ కు కథ చెప్పడానికి ఉత్సాహ పడే దర్శకుల కథలు వింటూ బన్నీ టీమ్ లో కీలక సభ్యుడుగా కొనసాగుతున్నాడు. ఆర్ష పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబడ్డ అర్షాస్ అంజలి వీడియె మేకింగ్ లో సాయి చాల చురుకైన పాత్ర నిర్వహించడమే కాకుండా ఆ వీడియో అందరికీ నచ్చే విధంగా తీర్చి దిద్దడంలో ఇతడు చాల కీలకంగా వ్యవహరించడంతో ఆ వీడియోను చూసిన ఇండస్ట్రీ వర్గాలు సాయికి ఇంత టాలెంట్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.


ప్రముఖ దర్శకుడు మణిరత్నం 1990 ప్రాంతాలలో తీసిన ‘అంజలి’ మూవీలోని ‘అంజలి అంజలి’ పాటకు రీమేక్ గా తీయబడ్డ ఈ వీడియోలో బన్నీ కూతురు ఆర్ష నటన ‘అం జలి’ సినిమాలోని అలనాటి బేబి షామిలీ నటనను గుర్తు వచ్చేలా చేసింది. వీడియో మేకింగ్ విలువలతో పాటు మంచి ఫోటోగ్రాఫీ తోడవ్వడంతో ఈ వీడియో కొన్ని గంటలలోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. ఈ వీడియోతో సాయి ప్రతిభ కూడ బయటకు రావడంతో త్రివిక్రమ్ టీమ్ లో పనిచేసిన రాని పేరు బన్నీ కూతురు తో ఒక్క వీడియోకి పనిచేసి సాయి క్రెడిట్ కొట్టేసాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: