13 ఏళ్ల వయసులో కారు యాక్సిడెంట్ లో తన కాలు కోల్పోయిన మయూరి సుధాచంద్రన్ తనకిష్టమైన డాన్స్ ని వదులుకోలేదు. జైపూర్ కాల్ తో ఆమె నాట్యం చేయడం ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. డాన్స్ చేయడానికి కాళ్లు అవసరం లేదని ఆమె చెప్పకనే చెప్పారు. ఆమె సంకల్పానికి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. భారతీయ సినీ నిర్మాత రామోజీరావు కూడా తన జీవిత చరిత్రను దృశ్యకావ్యంగా చూపించారు. రామోజీరావు తీసిన ఫస్ట్ బయోపిక్ మయూరి అని సుధాచంద్రన్ అలీతో సరదాగా ప్రోగ్రాం లో చెప్పుకొచ్చారు. డిసెంబర్ 28వ తేదీన ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఆమె కనిపించనున్నారు. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అందులో ఆమె మాట్లాడుతూ తన కుటుంబం మొత్తం ఒకే దగ్గర సమావేశమై సినిమా చేయాలా వద్దా అని చర్చించారట.

అయితే సినిమాలో నటించడానికి తన తండ్రి ఓకే చెప్పారని కానీ తన అమ్మ అంగీకరించలేదని సుధాచంద్రన్ చెప్పుకొచ్చారు. తండ్రి అంగీకారంతోనే తాను సినిమాల్లో నటించానని ఆమె అన్నారు. మొదటి రోజు షూటింగ్ సమయంలో బాగా ఏడ్చేశానని ఆమె అన్నారు. రామోజీరావు ఒక బ్లాంక్ చెక్ సుధాచంద్రన్ ముందు నుంచి నువ్వే ప్రైస్ చెప్పు.. ఎంత పారితోషికం కావాలంటే అంత ఇచ్చేస్తానని చెప్పారట. అయితే ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆమె ఆర్థికంగా వెనుదిరిగి చూడలేదట. అంటే ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ లో డబ్బులు ఏ రోజు కూడా తగ్గలేదట. సుధా చంద్రన్ ఎన్నో భాషా సినిమాల్లో నటించారు కానీ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు మాత్రమే ఆమెను గుర్తు పడతారట. ఓ సారి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగగానే తెలుగు ప్రేక్షకులు వచ్చి మీరు మయూరి కదా అని ఆప్యాయంగా పలకరించారట.

తాను లవ్ మ్యారేజ్ చేసుకున్న అని పంజాబీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని ఆమె అన్నారు. "ఒక ఫిలిం చేసాము ఆ ఫిలిం నిజానికి విడుదల కాలేదు కానీ ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే నాకు పంజాబీ వ్యక్తి రవి కలిశారు. ఆ తర్వాత ప్రేమించుకున్న ఇంట్లో చెప్తే సౌత్ ఇండియా వాళ్ళకి కల్చర్ ఉంటుంది కానీ వాళ్ళకి కల్చర్ ఉండదని ఇంట్లో వాళ్ళు మా పెళ్లికి అభ్యంతరం తెలిపారు. సౌత్ ఇండియా వాళ్ళకి కల్చర్ ఉంటే నార్త్ ఇండియా వారికి అగ్రికల్చర్ ఉంటుంది అని నా భర్త చెప్పారు. కొద్ది రోజుల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకున్నారు పెళ్లి అయిపోయింది" అని ఆమె అన్నారు. పొట్టకూటి కోసం విలన్ పాత్రలో కూడా చేశానని ఆమె చెప్పి ఆశ్చర్యపరిచారు. మయూరి సుధాచంద్రన్ గురించి మరిన్ని విషయాలు 28వ తేదీన ప్రసారమయ్యే ఎపిసోడ్ లో చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: